Black Pepper Remedies: మిరియాలను బ్లాక్ గోల్డ్ ఎందుకంటారు, రోజూ తింటే ఏమౌతుంది

Black Pepper Remedies: ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ఘిగా ఉంటాయి. ఏ పోషకాలు ఎందులో ఉంటాయో తెలుసుకుని వాడగలిగితే అంతకంటే మంచిది మరొకటి ఉండదు. ఎందుకంటే ప్రకృతిలో అన్ని పోషకాలున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 30, 2024, 08:57 PM IST
Black Pepper Remedies: మిరియాలను బ్లాక్ గోల్డ్ ఎందుకంటారు, రోజూ తింటే ఏమౌతుంది

Black Pepper Remedies: ప్రకృతి లభించే వివిధ రకాల పోషక పదార్ధాల్లో విరివిగా లభించేది కాకపోయినా ప్రతి కిచెన్‌లో లభ్యమయ్యేది మిరియాలు. దీనినే బ్లాక్ గోల్డ్ అంటారు. ఎందుకంటే పోషకాల విషయంలో బంగారమంత విలువైందిగా భావిస్తారు. అలాంటి బ్లాక్ గోల్డ్‌ను రోజూ తీసుకుంటే ఎలాంటి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.

మిరియాలు ఆరోగ్యపరంగా అద్భుతమైన పోషకాలు కలిగింది కాబట్టే దీనిని బ్లాక్ గోల్డ్ అంటారు. ఇందులో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే మిరియాలు రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా దగ్గు, ఆస్తమా, జలుబు ఉన్నప్పుడు మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి. మిరియాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య పోతుంది. జీర్ణక్రియ మెరుగుపడటంతో మలబద్ధకం సమస్య పోతుంది. అంతేకాకుండా మిరియాల కారణంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 

మిరియాలలో ఉండే పెపరిన్ అనే పదార్ధం యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. శరీరంలో ప్రో ఇన్‌ఫ్లమేటరీ పదార్ధాల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. మిరియాలు రోజూ తినడం వల్ల ఆర్ధరైటిస్, ఆస్తమా, వాపు సమస్యల్ని పూర్తిగా తగ్గిస్తుంది. మెటబోలిజం వేగవంతమౌతుంది. ఫలితంగా రక్తనాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తొలగిపోతుంది. బరువు నియంత్రణలో అద్భుతంగా దోహదమౌతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. చర్మ సంరక్షణకు కూడా చాలా మంచిది. 

మిరియాలలో ఉండే పెపరిన్ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్య సంరక్షణకు చాలా మంచిది. ఇందులో ఉండే పెపరిన్ అనే పదార్ధం హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. ఫలితంగా గుండె వ్యాధులు, కేన్సర్, ఆయాసం, డయాబెటిస్ సమస్యలకు చెక్ పెడుతుంది. నిర్ణీత వయస్సుకు ముందే వృద్ధాప్య ఛాయలు తొలగిస్తుంది.

Also read: Flight Luggage Rules: కొత్త విమానం లగేజ్ రూల్స్ , ఎన్ని ఎలాంటి బ్యాగ్‌లకు అనుమతి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News