Flight Luggage Rules: కొత్త విమానం లగేజ్ రూల్స్ , ఎన్ని ఎలాంటి బ్యాగ్‌లకు అనుమతి

Flight Luggage Rules: విమాన ప్రయాణీకులకు ముఖ్య గమనిక. విమానం లగేజ్ నిబంధనలు మారిపోయాయి. ఇక నుంచి విమానంలో మీతో పాటు ఎన్ని బ్యాగ్‌లు, ఏయే బ్యాగ్‌లు తీసుకెళ్లవచ్చో తెలుసుకోండి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 30, 2024, 06:33 PM IST
Flight Luggage Rules: కొత్త విమానం లగేజ్ రూల్స్ , ఎన్ని ఎలాంటి బ్యాగ్‌లకు అనుమతి

Flight Luggage Rules: విమాన ప్రయాణంలో లగేజ్ నిబంధనలు మారాయి. ముఖ్యంగా హ్యాండ్ బ్యాగ్ విషయంలో మార్పు వచ్చింది. ఇక నుంచి ప్రయాణీకులు విమానంలో తమ వెంట ఒకే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లగలరు. అదే సమయంలో అన్ని రకాల బ్యాగ్‌లకు అనుమతి ఉండదు. అందులో కూడా మార్పు వచ్చింది. 

ఫైల్ట్ లగేజ్ రూల్స్ మారాయి. కొత్త సంవత్సరం వస్తోంది. చాలామంది హాలిడే వెకేషన్ లేదా న్యూ ఇయర్ సెలబ్రేషన్‌కు సిద్దమౌతుంటారు. ఈక్రమంలో మీ హ్యాండ్ బ్యాగ్ లగేజ్ లేదా చెకిన్ లగేజ్ విషయంలో వచ్చిన మార్పులు గమనించాలి. లేకపోతే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఫ్లైట్ రూల్ మారిపోయింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ హ్యాండ్ బ్యాగ్ పాలసీను పూర్తిగా మార్చేసింది. కొత్త పాలసీ ప్రకారం ప్రయాణీకులు తమ వెంట ఒకే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లగలరు. హ్యాండ్ బ్యాగ్ లేదా కేబిన్ బ్యాగ్ ఒక్కటే ఉండాలి. ఈ కొత్త నిబంధన డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రెండింటికీ వర్తిస్తుంది. రోజురోజుకూ ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిబంధనలో మార్పు వచ్చింది. 

ఫ్లైట్ లగేజ్ కొత్త పాలసీ

ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టమైంది. ఫలితంగా లగేజ్ రూల్స్ మారాయి. ఎయిర్ ఇండియా ప్రకారం ప్రీమియం ఎకానమీ, ఎకానమీ తరగతి పాసెంజర్లు 7 కిలోల వరకే హ్యాండ్ బ్యాగ్ అనుమతి ఉంటుంది. అదే బిజినెస్ లేదా ఫస్ట్ క్లాస్ కేటగరీ ప్రయాణీకులకు 10 కిలోల వరకూ అనుమతి ఉంటుంది. కేవలం బరువు విషయంలోనే కాకుండా బ్యాగ్ పరిమాణంలో కూడా మార్పు చోటుచేసుకుంది. హ్యాండ్ బ్యాగ్ లేదా కేబిన్ బ్యాగ్ సైజ్ 40 సెంటీమీటర్లు పొడవు, 20 సెంటీమీటర్లు వెడల్పు, 55 సెంటీమీటర్లు ఎత్తు దాటకూడదు. ఇతర బ్యాగ్‌లు చెకిన్ అవుతాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా హ్యాండ్‌బ్యాగ్ రూల్స్ విడుదల చేసింది. ఒకే ఒక కేబిన్ బ్యాగ్ ఉండాలి. ఆ బ్యాగ్ సైజ్ 115 సెంటీమీర్లు దాటకూడదు. బరువు 7 కిలోల వరకు ఉండవచ్చు. 

ఇది కాకుండా పర్సనల్ బ్యాగ్ లేదా లేడీస్ పర్స్ లేదా స్మాల్ ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకెళ్లవచ్చు. ఆ బరువు 3 కిలోలు దాటకూడదు. ఇండిగో రెండు బ్యాగ్‌లు క్యారీ చేసేందుకు అనుమతిస్తుంది. ఒకటి కేబిన్ బ్యాగ్ రెండవది పర్సనల్ బ్యాగ్. 

Also read: US Visa Updates: భారతీయ విద్యార్ధులకు గుడ్‌న్యూస్, లక్ష నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు మంజూరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News