Garlic and Beetroot: ఆ రెండూ డైట్‌లో చేర్చుకుంటే హార్ట్ ఎటాక్, బీపీ తగ్గినట్టే

Garlic and Beetroot: మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఆధునిక జీవన శైలి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఇందులో ప్రధానంగా రక్తపోటు, గుండెపోటు. ఈ రెంటికీ సమాధానం ప్రతి ఇంట్లో ఉండే ఆ రెండు పదార్ధాలు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 22, 2022, 04:14 PM IST
Garlic and Beetroot: ఆ రెండూ డైట్‌లో చేర్చుకుంటే హార్ట్ ఎటాక్, బీపీ తగ్గినట్టే

Garlic and Beetroot: మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఆధునిక జీవన శైలి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఇందులో ప్రధానంగా రక్తపోటు, గుండెపోటు. ఈ రెంటికీ సమాధానం ప్రతి ఇంట్లో ఉండే ఆ రెండు పదార్ధాలు..

మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానమే అనారోగ్యానికైనా..ఆరోగ్యానికైనా కారణమౌతుంటాయి. అందుకే అటు ఆహారం ఇటు వ్యవహారం రెండూ క్రమశిక్షణగా ఉండేట్టు చూసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. ఆహారం, వ్యవహారం రెండూ బాగుంటే అంతా మంచిదేనంటున్నారు. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవలికాలంలో ఎక్కువగా కన్పిస్తున్న సమస్యలు గుండెపోటు..రక్తపోటు. ఎంత ప్రమాదకరమో..అంత సులభంగా నియంత్రణలో కూడా ఉంచుకోవచ్చు. ప్రతి ఇంట్లో సర్వ సాధారణంగా ఉపయోగించే వెల్లుల్లి-బీట్‌రూట్ ఈ రెండింటికీ అద్భుత ఔషధాలుగా ఉపయోగపడతున్నాయి.

వెల్లుల్లి, బీట్‌రూట్‌ రెండూ తీసుకుంటే హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ఎటాక్ ప్రమాదం తగ్గుతుందా..తాజా అధ్యయనం ఏం చెబుతోంది. బ్రిటన్‌కు చెందిన డాక్టర్ క్రిస్ వాన్ చేసిన అధ్యయనం ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ప్రజల ప్రాణాల్ని కాపాడటంలో ఈ రెండు పదార్ధాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయని తెలిసింది. 28 మంది వాలంటీర్లపై ఈ అధ్యయనం జరిగింది. రీసెర్చ్ ప్రారంభించడానికి ముందు మ్యాగ్జిమమ్ బీపీ వీరిలో 130 వరకూ ఉంది. సాధారణంగా 120 ఉండాలి. ఆ తరువాత వీరిని రెండు వేర్వేరు గ్రూపులుగా విభజించి..3 వారాల వరకూ వెల్లుల్లి, బీట్‌రూట్ ఇచ్చారు. 

ఆ తరువాత ఫలితాలు చూస్తే చాలా మెరుగ్గా కన్పించింది. అటు బీట్‌రూట్ , ఇటు వెల్లుల్లి తీసుకున్నవారిలో బీపీ 2-3 పాయింట్లు తగ్గింది. అటు హార్ట్ అటాక్ ముప్పు కూడా పది శాతం తగ్గింది. ఇది కేవలం 3 వారాల అధ్యయనంతో తేలిన విషయం. 2-3 నెలలు కంటిన్యూగా తీసుకుంటే బీపీ మరింతగా తగ్గుతుందంటున్నారు వైద్య నిపుణులు. ఈ రెండూ తీసుకోవడం వల్ల రక్తనాళం వ్యాకోచించి..రక్తం సులభంగా ప్రవహిస్తుంది. దాంతో హార్ట్ అటాక్ ముప్పు తగ్గుతుంది. 

బీట్‌రూట్ ప్రయోజనాలు

బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్, వెల్లుల్లిలోని ఎలిసిన్‌తో చాలా ప్రయోజనాలుంటున్నాయి. ఈ నైట్రేట్ అనేది అన్ని రకాల పచ్చని ఆకుగూరల్లో పుష్కలంగా ఉంటుంది. బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల నైట్రేట్ పుష్కలంగా లభిస్తుంది. ఒకవేళ బీట్‌రూట్‌ను ఉడకబెట్టాలనుకుంటే...ఏ చిన్న భాగం కూడా తొలగించకుండా పూర్తిగా అలాగే ఉడకబెట్టాలి. ఆకుకూరల్ని ఉడకబెట్టే కంటే స్టీమ్ కుక్ చేసి తినడం మంచిది. లేదా తక్కువ నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తరువాత మిగిలిన నీళ్లను సూప్ లేదా ఇతర పదార్ధాల్లో కలిపి తీసుకుంటే మంచిది. 

ఎలా తీసుకోవాలి

సలాడ్, కాయగూరల్ని పచ్చిగానే తీసుకోండి. వెజిటబుల్స్‌లో ఉండే నైట్రేట్ పూర్తిగా లభించేది అప్పుడే. వండిన తరువాత సహజంగానే నైట్రేల్ శాతం తగ్గిపోతుంది. ఎందుకంటే నైట్రేట్ అనేది నీటిలో కరిగిపోతుంది. అందుకే నైట్రేట్ కోల్పోకుండా ఉండాలంటే పచ్చిగా తీసుకోవడం మంచిది. వెల్లుల్లిని ఎప్పుడూ మైక్రోవేవ్‌లో ఉంచకూడదు. వెల్లుల్లిని సరిగ్గా నూరుకుని..లేదా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని తీసుకోవాలి. బీట్‌రూట్, వెల్లుల్లి ఎలా తీసుకున్నా ఫరవాలేదు. కానీ క్రమం తప్పకుండా పరిధి దాటకుండా తీసుకోవాలి. 

Also read: Sweating Reasons: రాత్రిళ్లు చెమట్లు పడుతున్నాయా..అయితే కేన్సర్ సంకేతం కావచ్చు..నిర్లక్ష్యం వద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News