Blood Pressure: అధిక రక్తపోటు తగ్గించాలి అనుకుంటున్నారా.. ఈ డ్రింక్స్ తాగాల్సిందే..!

High BP diet: ఇప్పటి రోజుల్లో రక్తపోటు (బీపీ) అనేది చాలామందిలో.. సాధారణంగా కనిపించే సమస్యగా మారింది. ఇది సరిగ్గా నియంత్రించకపోతే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బీపీని నియంత్రించడానికి సరైన ఆహారం, జీవనశైలి మార్చాల్సిన అవసరం ఉంది. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, లాంటి పానీయాలు కూడా బీపీని నియంత్రించడంలో సహాయపడతాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 4, 2024, 09:01 PM IST
Blood Pressure: అధిక రక్తపోటు తగ్గించాలి అనుకుంటున్నారా.. ఈ డ్రింక్స్ తాగాల్సిందే..!

Drinks for high bp: ప్రస్తుతం అధిక రక్తపోటు (హైపర్టెన్షన్) ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. రక్తపోటు నియంత్రణ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది హృదయ ఆరోగ్యానికి, మెదడు సంబంధిత సమస్యలకూ దారితీస్తుంది. ఈ వ్యాధిని నియంత్రించడం కోసం వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగిన పానీయాలు.. తాగడం వంటివి చేయడం కీలకం. రక్తపోటు నియంత్రణకు సహాయపడే కొన్ని పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరికాయ రసం:

ఉసిరికాయ (ఆమ్లా) అనేది సహజమైన ఔషధగుణాల కలిగిన ఒక పండు. ఇందులో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఉసిరికాయ రసాన్ని రోజూ తాగడం ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనిని రసం నచ్చకపోతే నీటితో కలిపి కొంచెం తేనె కూడా వేసి తాగచ్చు. 

కొబ్బరి నీళ్లు:

కొబ్బరి నీళ్లు సహజంగా.. పౌష్టికపదార్థాలతో నిండి ఉంటాయి. ఇందులో ఎలక్ట్రోలైట్స్, ముఖ్యంగా పొటాషియం, అధికంగా ఉంటాయి. పొటాషియం రక్తనాళాల్లోని సోడియం పరిమాణాన్ని తగ్గించి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ ఒక గ్లాస్ కొబ్బరి నీరు తాగడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు.

బీట్‌రూట్ రసం:

బీట్‌రూట్‌లో నైట్రేట్ అనే పదార్థం ఉంది, ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను విస్తరింపజేసి రక్తప్రసరణను సులభతరం చేస్తుంది. దానివల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది. బీట్‌రూట్ రసం రోజూ తాగడం ద్వారా రక్తపోటును సహజంగా తగ్గించవచ్చు.

పుదీనా రసం:

పుదీనా అనేది సహజమైన ఔషధగుణాలు కలిగిన మొక్క. పుదీనా రసం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనిని తయారుచేసేందుకు పుదీనా ఆకులను.. నీటిలో మరిగించి, ఆ నీటిని చల్లార్చి తాగచ్చు.

జామకాయ రసం:

జామకాయలో విటమిన్ C, ఫైబర్, పొటాషియం వంటి పౌష్టికపదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను ప్రశాంతంగా ఉంచి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. జామకాయ రసాన్ని రోజూ తాగడం ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

వెన్న తీసేసిన మజ్జిగ:

మజ్జిగ శరీరానికి శక్తిని అందిస్తుంది. వెన్నను తీసిన మజ్జిగ, అంటే తక్కువ కొవ్వు ఉన్న మజ్జిగ అన్నమాట. దాన్ని తాగడం ద్వారా రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. ఈ మజ్జిగలోని ప్రొబయోటిక్స్ గట్ ఆరోగ్యానికి మంచిది. అవి రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

దాల్చిన చెక్క నీళ్లు:

దాల్చిన చెక్క రక్తపోటు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాల పై ఉన్న ప్రెజర్ ను తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజుకు ఒకసారి దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి తాగడం ద్వారా రక్తపోటును సహజంగా నియంత్రించవచ్చు.

అల్లం జ్యూస్:

అల్లం కూడా రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం టీ లేదా అల్లం రసం రోజూ తాగడం వల్ల కూడా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

ఈ పానీయాలు రక్తపోటు నియంత్రణకు చాలా బాగా సహాయపడతాయి. వాటిని రోజూ తాగడం ద్వారా రక్తపోటును ఎటువంటి ట్యాబ్లెట్లు లేకుండా ఇంట్లో దొరికే పదార్ధాలతో తగ్గించవచ్చు. కానీ ఎలాంటి సమయంలో అయినా రక్తపోటు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే.. డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

Also Read: Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్‌ ప్రభుత్వంపై శాపనార్థాలు

Also Read: Telangana Floods: విరాళంపై రగడ.. వైజయంతి మూవీస్‌కు తెలంగాణ విద్యార్థుల వార్నింగ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x