Mastectomy: మాస్టెక్టమీతో బ్రెస్ట్ కేన్సర్ మరణాలు ఎంతవరకూ తగ్గించవచ్చు

Mastectomy: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ వంటి వ్యాధులు ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా బ్రెస్ట్ కేన్సర్ చాలా వేగంగా విస్తరిస్తోంది. బ్రెస్ట్ కేన్సర్ కారణంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 21, 2024, 10:34 PM IST
Mastectomy: మాస్టెక్టమీతో బ్రెస్ట్ కేన్సర్ మరణాలు ఎంతవరకూ తగ్గించవచ్చు

Mastectomy: బ్రెస్ట్ కేన్సర్ కేసుల్లో సాధారణంగా మహిళలకు మాస్టెక్టమీ చేస్తుంటారు. ఈ ప్రక్రియలో భాగంగా మొత్తం స్థనాన్ని లేదా కొద్దిభాగాన్ని తొలగిస్తారు. మాస్టెక్టమీ సర్జరీ మరణాల సంఖ్యను తగ్గించేస్తుంది. ఇటీవల జరిపిన కొన్ని అధ్యయనాల్లో సైతం ఇదే వెల్లడైంది. ముఖ్యంగా బ్రెస్ట్ కేన్సర్‌కు సంబంధించి బీఆర్సీఏ 1, బీఆర్సీఏ 2 వేరియంట్ కేసుల్లో ఇది చాలా ప్రయోజనకరం. 

బీఆర్సీఏ 1 లేదా బీఆర్సీఏ 2 వేరియంట్ కలిగిన మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చేందుకు 80 శాతం అవకాశాలున్నాయి. వివిధ రకాల అధ్యయనాల్లో తేలిన ప్రకారం మాస్టెక్టమీ అనేది బ్రెస్ట్ కేన్సర్ ముప్పును 90 శాతం తగ్గించేస్తుంది. బ్రెస్ట్ కేన్సర్ నియంత్రించేందుకు మాస్టెక్టమీ ఒక్కటే ఇప్పటి వరకూ అత్యంత సమర్ధవంతంగా పనిచేసే చికిత్సా విధానం. బీఆర్సీఏ 1 కలిగిన 16 వందలకు పైగా మహిళల్ని అధ్యయనం చేసినప్పుడు అందులో సగం మందికి మాస్టెక్టమీ ద్వారా నయమైంది. 

మాస్టెక్టమీ అంటే స్థనాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా సర్జరీ చేసి తొలగించడమే. ఈ ప్రక్రియ ద్వారా కేన్సర్ ముప్పును 80 శాతం వరకూ తగ్గించవచ్చు. మాస్టెక్టమీ చేసిన 15 ఏళ్ల తరువాత బ్రెస్ట్ కేన్సర్ కారణంగా మరణించేవారి సంఖ్య 1 శాతం కంటే తక్కువే ఉందని తేలింది. ఈ అధ్యయనంలో రెండు గ్రూపుల మధ్య మరణాల్లో పెద్ద అంతరం లేదని తేలింది. కేన్సర్ ముప్పును తగ్గించే మాస్టెక్టమీతో బ్రెస్ట్ కేన్సర్ వృద్ధిని కూడా తగ్గించేస్తుంది. అభివృద్ధి చెందిన శాస్త్ర విజ్ఞానం నేపధ్యంలో బ్రెస్ట్ కేన్సర్ గుర్తించేందుకు ఎంఆర్ఐ సహా చాలా మంచి మంచి పద్ధతులున్నాయి. అందుకే సర్జరీ అనేది ఓ ప్రత్యామ్నాయం మాత్రమే. చికిత్సా విధానం కానేకాదు. కానీ మాస్టెక్టమీతో బ్రెస్ట్ కేన్సర్ వ్యాధిగ్రస్థులు చాలావరకూ కోలుకుంటున్నారు.

బ్రెస్ట్ కేన్సర్ సోకిన రోగుల్లో మాస్టెక్టమీ ఎంచుకున్నవారు బతికిబట్టకడుతున్న సందర్భాలు ఎక్కువే ఉన్నాయి. అంటే ఈ ప్రక్రియలో మరణ సంభావ్యత తక్కువే. అందుకే తప్పని పరిస్థితుల్లో మాస్టెక్టమీవైపు ఆసక్తి చూపిస్తున్నారు. 

Also read: Moong Dal Soup: పెస‌ర‌ప‌ప్పుతో సూప్ తయారీ ఇలా..దీని వల్ల జ్వరం మాయం!

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News