Celery Juice Benefits: సెలెరీ అనేది ఒక ప్రసిద్ధమైన కూరగాయ. ఇది పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది. సాధారణంగా సలాడ్‌లలో, సూప్‌లలో ఇతర వంటకాలలో ఉపయోగిస్తారు. పెలెరీ ఎంతో మృదువుగా ఉంటుంది.
సెలెరీ తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం కలిగి ఉంటుంది. ఇది విటమిన్ K, విటమిన్ C, ఫోలేట్, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను ఉంటాయి. ఇది ఫైబర్‌కు కూడా ఎక్కువగా ఉంటుంది. సెలెరీ అనేది కేవలం సలాడ్‌లలో వేసే ఒక కూరగాయ మాత్రమే కాదు. ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
సెలెరీ ఎందుకు ఆరోగ్యానికి మంచిది?
సెలెరీలో ఎక్కువ శాతం నీరు, ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీని డైట్‌లోచేర్చుకోవడం చాలా మంచిది. బరువు తగ్గాలని భావించేవారు సెలెరీ తినడం మంచిది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఎక్కువ నీరు ఉండటం వల్ల బరువు తగ్గడానికి మంచి ఎంపిక. సెలెరీలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. జ్వరాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సెలెరీలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్‌లను నిరోధించడంలో సహాయపడుతుంది. విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల కళ్ళ ఆరోగ్యానికి మంచిది. సెలెరీ జ్యూస్‌ను ఇంటి వద్ద తయారు చేయడం చాలా సులభం. కేవలం కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది.
సెలెరీ జ్యూస్ తయారీకి అవసరమైనవి:
తాజా సెలెరీ కొమ్ములు
జ్యూసర్
తయారీ విధానం:
సెలెరీ కొమ్ములను బాగా కడగండి. శుభ్రం చేసిన సెలెరీ కొమ్ములను జ్యూసర్‌లో వేసి జ్యూస్ తీయండి. తాజాగా తయారు చేసిన సెలెరీ జ్యూస్‌ను వెంటనే తాగండి.
చిట్కాలు:
సెలెరీ జ్యూస్‌కు ఆపిల్, క్యారెట్, బీట్‌రూట్ వంటి ఇతర కూరగాయలను కలిపి రుచిని మెరుగుపరచవచ్చు.
పుదీనా ఆకులు జ్యూస్‌కు రుచిని ఇవ్వడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
జింజర్ జ్యూస్‌కు వేడిని ఇస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
తాజాగా తయారు చేసిన సెలెరీ జ్యూస్‌లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని వెంటనే తాగడం మంచిది.
ప్రతిరోజు ఒక గ్లాసు సెలెరీ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.