Coconut Water Benefits: ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగితే హైబీపీతో పాటు అనేక సమస్యలకు ఫుల్ స్టాప్!

Coconut Water Benefits: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. మార్చి నెల మొదటి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం ముఖ్యం. ఎండల ధాటికి వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడేందుకు కొబ్బరి నీరు తాగడం మంచిది. అయితే ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 06:41 PM IST
Coconut Water Benefits: ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగితే హైబీపీతో పాటు అనేక సమస్యలకు ఫుల్ స్టాప్!

Coconut Water Benefits: వేసవి కాలం రానే వచ్చేసింది. మార్చి నెలలో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ మనం తినే ఆహారంలో కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి బయటపడొచ్చు. ప్రతిరోజూ కొబ్బరినీరు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండార జాగ్రత్త వహించవచ్చు. అయితే కొబ్బరినీరు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

అధిక రక్తపోటు నియంత్రణ కోసం..

రక్తపోటు అదుపులో ఉండేందుకు రోజూ కొబ్బరినీళ్లు తాగడం మంచిది. అధిక రక్తపోటును నియంత్రించడంలో కొబ్బరి నీరు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ రక్తపోటు సాధారణ స్థాయిని తీసుకొచ్చేందుకు కొబ్బరి నీరు సహకరిస్తుంది. 

రోగనిరోధక శక్తి మెరుగు..

కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరికాయలో దాదాపు 600 మి.గ్రా పొటాషియం లభిస్తుంది. ఈ క్రమంలో ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. 

వాంతుల నుంచి ఉపశమనం

వాంతులు, విరేచనాల సమస్యతో బాధపడే వారు కొబ్బరి నీరు తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాంటి అనారోగ్య సమస్యలతో తరచూ బాధపడే వారు ఈ జాగ్రత్తలు పడితే మంచిది. వాంతులు, విరేచనాలతో పాటు కడుపులో, పేగుల్లో మంట.. అల్సర్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)    

Also Read: Knee Pain Remedies: ఈ పండ్లు తింటే కీళ్ల నొప్పులు, వాపులు తప్పకుండా తగ్గుతాయి!

Also Read: Pomegranate Benefits: దానిమ్మ విత్తనాలు లేదా జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News