Nasal spray vaccine: నాజల్ స్ప్రే కరోనా వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందా ? Nasal spray vaccine benefits ?

Nasal spray Coronavirus vaccine benefits: కరోనావైరస్‌పై (Coronavirus) పోరాటంలో నాజల్ వ్యాక్సిన్స్ సమర్థవంతంగా పనిచేస్తాయనే అంచనాలు, అధ్యయనాల నివేదికల మధ్య నాజల్ వ్యాక్సిన్స్ (Nasal spray shots) పని తీరుపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2021, 04:49 PM IST
Nasal spray vaccine: నాజల్ స్ప్రే కరోనా వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందా ? Nasal spray vaccine benefits ?

Nasal spray Coronavirus vaccine benefits: కరోనావైరస్ వచ్చిన కొత్తలో కరోనాకు విరుగుడుగా కొవిడ్-19 వ్యాక్సిన్ వస్తే సరిపోతుంది అని భావించారు. కానీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక కరోనా కొత్త వేరియంట్స్‌తో మరో కొత్త సమస్య వచ్చి పడింది. రోజుకో రకమైన కొత్త వేరియంట్ పుట్టుకొస్తున్న ప్రస్తుత తరుణంలో కరోనావైరస్ నివారణ కోసం తయారు చేసిన వ్యాక్సిన్లు కొత్త వేరియంట్స్‌ని ధీటుగా ఎదుర్కోగలవా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే మళ్లీ కొత్తగా తెరపైకి వచ్చిన వ్యాక్సిన్ పేరే ఈ నాజల్ స్ప్రే కరోనా వ్యాక్సిన్. 

కరోనావైరస్‌పై పోరాటంలో నాజల్ వ్యాక్సిన్స్ సమర్థవంతంగా పనిచేస్తాయనే అంచనాలు, అధ్యయనాల నివేదికల మధ్య నాజల్ వ్యాక్సిన్స్ పని తీరుపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. 

ప్రస్తుతం విరివిగా ఉపయోగిస్తున్న కరోనావైరస్ వ్యాక్సిన్స్ కంటే నాజల్ స్ప్రే కొవిడ్ వ్యాక్సిన్స్ పని తీరు మెరుగ్గా ఉంటుందన్న నివేదికల నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీదారుల ఫోకస్ కూడా నాజల్ స్ప్రే (Nasal spray vaccines) కరోనా వ్యాక్సిన్లపైకి షిఫ్ట్ అయింది. 

Also read : Health benefits of Ginge: అల్లంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?

కరోనావైరస్ నాజల్ స్ప్రే కొవిడ్ వ్యాక్సిన్ల తయారీలో భాగంగా హైదరాబాద్‌కే చెందిన భారత్ బయోటెక్ (Bharat biotech) కంపెనీ గత ఏడాది నుంచే ఆ పనుల్లో నిమగ్నమైంది. 

కొవాగ్జిన్ వ్యాక్సిన్ (Covaxin vaccine) తయారు చేసిన భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ షాట్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నాజల్ వ్యాక్సిన్లతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత రెట్టింపవుతుందని నాజల్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. భారత్ బయోటెక్ కూడా అదే విషయాన్ని స్పష్టంచేస్తోంది. 

నాజల్ వ్యాక్సిన్ షాట్స్ (Nasal spray Coronavirus vaccine) ఎందుకు సమర్థవంతంగా పనిచేస్తాయనే ప్రశ్నలకు శాస్త్రవేత్తలు చెబుతున్న సమాధానం ఏంటంటే.. సాధారణ పద్ధతిలో తీసుకునే వ్యాక్సిన్ శరీరంలోకి వెళ్లి వ్యాధినిరోధక శక్తి పెంచేందుకు దోహదపడితే, నాజల్ ద్వారా తీసుకునే వ్యాక్సిన్ షాట్ నేరుగా శ్వాసకోశ నాళికలోకి వెళ్లి వ్యాధి నిరోధక కణాల పెంచడంతో పాటు యాంటీబాడీస్ పెరగడానికి సహాయపడుతుందని అంటున్నారు. అంటే రెగ్యులర్ వ్యాక్సిన్ తో పోల్చితే నాజల్ వ్యాక్సిన్ షాట్ ప్రభావమే ఎక్కువ అనేది పరిశోధకులు అభిప్రాయం.

Also read : COVID-19 vaccines for kids: చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్లు.. క్లారిటీ ఇచ్చిన గులేరియా

అన్నింటికి మించి స్వల్ప వ్యవధిలో ఎక్కువ మంది తమ శరీరంలో యాంటీబాడీస్ (Antibodies) పెంపొందించుకోవడానికి ఇదో చక్కటి మార్గం అని పరిశోధకులు చెబుతున్నారు.

ఇంట్రా-మస్కులర్ వ్యాక్సిన్‌తో (intra-muscular vaccines) పోల్చితే.. నాజల్ వ్యాక్సిన్ షాట్స్ తయారు చేసే కంపెనీల సంఖ్య ప్రస్తుతానికి చాలా తక్కువగానే ఉంది. మన దేశంలో భారత్ బయోటెక్ నాజల్ స్ప్రే కరోనా వ్యాక్సిన్ షాట్స్ తయారీపై దృష్టిపెట్టింది. 

ఫేజ్ 1 ట్రయల్స్ పూర్తి చేసుకున్న భారత్ బయోటెక్ నాజల్ స్ప్రే కొవిడ్ వ్యాక్సిన్ (Bharat Biotech's nasal vaccine) ఇటీవలే ఫేజ్ 2 ట్రయల్స్ కోసం అనుమతి పొందింది. తొలి దశలో 18-60 ఏళ్ల వయస్సు వారిపై నాజల్ వ్యాక్సిన్ షాట్స్ ప్రయోగించి చూశారు. 

ఆస్ట్రేలియా, రష్యాలోనూ నాజల్ స్ప్రే కొవిడ్ వ్యాక్సిన్లపై (Nasal spray COVID-19 vaccine) ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే.. కరోనావైరస్‌ను మరింత ధీటుగా ఎదుర్కోవచ్చని పరిశోధకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

Also read : Health tips: వ్యాయమంతో Weight loss, fitness మాత్రమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News