Cucumber Prevents Heatstroke: ఎండకాలం వచ్చిందంటే విపరీతంగా చెమటలు పట్టేస్తాయి వేడి పెరిగిపోతుంది. దీంతో స్క్రీన్ రాష్, దురదలు కూడా వస్తాయి. వెంటనే చల్లటి ఆహార పానియాల కోసం వెతుకుతాం. కానీ, ఇవి అనారోగ్యానికి దారి తీస్తాయి. కీరదోసలో 96% నీటి కంటెంట్ ఉంటుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అంతేకాదు ఇది స్కిన్ సమస్యలు రాకుండా కాపాడుతుంది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కీరదోసకాయతో బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు.
కీరదోసకాయలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ ఏ, సీ, కే పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇది క్యాన్సర్ ఇతర ఎముకల వ్యాధులు రాకుండా నివారిస్తుంది.ముఖ్యంగా కీరదోసకాయను సలాడ్స్, డ్రెస్సింగ్, సూప్స్ లో వేసుకొని తినవచ్చు.లేదా నేరుగా కట్ చేసుకోను తినవచ్చు.
కీరదోసకాయతో డిటాక్స్ డ్రింక్ కూడా తయారు చేసుకోవచ్చు. దోసకాయను గ్రైండ్ చేసి అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుని మంచి డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. కావాలంటే ఇందులో పుదీనా ,నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. ఇది మంచి డిటెక్సిఫయర్ గా పనిచేస్తుంది మీ జీర్ణ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఇదీ చదవండి: ఈ 8 పండ్లు తింటూ బరువు ఫాస్ట్ గా తగ్గొచ్చని మీకు తెలుసా?
ఆరోగ్య ప్రయోజనాలు..
కీర దోసకాయలో చల్లదనం ఉంటుంది. అందులో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. కాబట్టి హీట్ స్ట్రోక్ గురికాకుండా కాపాడుతుంది. ఇది మంచి ఈవినింగ్ స్నాక్ లా పనిచేస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో యాంటీ ఆక్సిడెంట్ ఫ్లవనాయిడ్స్ కూడా ఉంటాయి.ఎండలో వెళ్ళినప్పుడు మీ కళ్ళు మంటలుగా ఉన్నప్పుడు కీరదోసకాయను కట్ చేసి ఒక 15 నిమిషాల పాటు కళ్ళపై పెట్టుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. కీర దోసకాయ తినడం వల్ల మన శరీరంలో హైడ్రేషన్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. కచ్చితంగా కీరదోసకాయ మన డైట్ లో చేర్చుకోవాలి
ఇదీ చదవండి: ఎండకాలం పచ్చిమామిడికాయ తింటే 10 ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు..
అంతేకాదు ఇందులో పొటాషియం, మెగ్నీషియం, డైటరీ ఫైబర్ వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అదుపులో ఉంచుతాయి దీంతో గుండా సమస్యలు కూడా రావు. కీర దోసకాయ తీసుకోవడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది పేగు ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కీరదోసకాయ షుగర్ లెవెల్స్ ని నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటిస్ కి మంచిది
కీరదోసకాయ ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల ముఖం మెరుస్తుంది ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి ముఖంపై ఫైన్ లైన్స్ ని తొలగిస్తుంది(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook