పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు కాల్షియం, విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి పెరుగును కొన్ని పదార్ధాలతో మిక్స్ చేయకూడదు. ఆ వివరాలు మీ కోసం..
పెరుగుతో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. క్రమం తప్పకుండా రోజూ పెరుగు సేవిస్తే అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పెరుగు ఆరోగ్యానికి ఎంత మంచిదైనా సరే..కొన్ని పదార్ధాలతో కలిపి పెరుగు తీసుకోకూడదు. వాస్తవానికి పెరుగు కడుపు చాలా మంచిది. కానీ ఒకవేళ మినపప్పుతో కలిపి పెరుగు తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. కడుపులో గ్యాస్, బ్లోటింగ్, స్వెల్లింగ్, మలబద్ధకం, వాంతులు, అజీర్ణ సమస్యలు ఎదురుకావచ్చు.
పెరుగుతో పాలు పొరపాటున కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే కడుపులో గ్యాస్, బ్లోటింగ్, మలబద్ధకం, వాంతులు, అజీర్ణం సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మీక్కూడా ఆ అలవాటుంటే వెంటనే ఆ అలవాటు మానుకోవల్సిందే. లేకపోతే ఆరోగ్యం వికటిస్తుంది.
చాలామంది పెరుగు పచ్చడి లేదా రాయితాలో వివిధ రకాల కూరగాయలతో పాటు ఉల్లిపాయలు కూడా కలుపుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లిపాయలతో పెరుగు తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు, ఎలర్జీ రావచ్చు.
Also read: Vitamin B12: విటమిన్ బి12 లోపముంటే..నిర్లక్ష్యం చేయవద్దు, బాడీ గుల్లగా మారిపోతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook