మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరల ప్రాముఖ్యాన్ని డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా కంటి చూపు కోసం ఆకూకూరలు తీసుకోవడం ఉత్తమమని అందరికీ తెలిసిందే. వంటల్లో వాడే కరివేపాకు(Curry Leaves Benefits) ఓ ఆహార పదార్థంగానే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కృషి జాగ్రన్ అనే నివేదిక ప్రకారం.. మన రక్తంలో చక్కెర స్థాయిలను కరివేపాకు నియంత్రిస్తుంది. డయాబెటిస్ (షుగర్ హెచ్చు తగ్గుల) నిర్వహణతో పాటు జీర్ణశయం, ఇతర అవయవాల పనితీరును మెరుగు పరుస్తుంది. కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా!
కృషి జాగ్రన్ రిపోర్ట్ అందించిన నిపుణుల నివేదిక ప్రకారం.. కరివేపాకును మనం క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయట. ఎందుకంటే కరివేపాకు(Curry Leaves)లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు పిండి పదార్ధాలను గ్లూకోజ్‌గా మార్చడాన్ని నివారించడంలోనూ సహాయపడతాయి, తద్వారా రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. Also Read: మితిమీరిన తిండి, వ్యాయామం ఆరోగ్యానికి చేటు.. షాకింగ్ నిజాలు
గర్భిణులకు మేలు
కరివేపాకు గర్భధారణలో కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలకు తరచుగా అయ్యే వాంతులను నియంత్రించడంతో పాటు వికారం, అసౌకర్యం కలగడాన్ని కరివేపాకు తగ్గిస్తుంది. కరివేపాకు.. వాంతులు, వికారం లక్షణాలను నియంత్రించడానికి జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రేరేపిస్తుంది. Also Read: మగవారిలో రొమ్ము క్యాన్సర్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
జీర్ణాశయానికి శ్రేయస్కరం
అజీర్తి, విరేచనాలు, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను కరివేపాకు తినడం ద్వారా నయం చేయవచ్చు. ఈ ఆకులు ఎక్కువ జీర్ణ ఎంజైమ్‌లతో నిండి ఉంటాయి. బరువు తగ్గడంలో కూడా కరివేపాకు కీలకప్రాత పోషిస్తుందని గతంలో రిపోర్టులు పేర్కొన్నాయి. భారత్‌లో కనిపించే, పెరిగే ఔషధ మూలికలలో కరివేపాకు ఒకటిగా వైద్య నిపుణులు భావిస్తారు. వంటలు రుచికరంగా అయ్యేందుకు కూడా కరివేపాకును వంటల్లో వాడుతుంటారు.