మగవారిలో రొమ్ము క్యాన్సర్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

రొమ్ము క్యాన్సర్ మగవారికి కూడా వస్తుంది. అయితే ఆడవారితో పోల్చితే మగవారిలో దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. అయినా దీన్ని తేలికగా తీసుకోరాదని వైద్యులు చెబుతున్నారు.

Shankar Dukanam Shankar Dukanam | Updated: Feb 13, 2020, 01:10 PM IST
మగవారిలో రొమ్ము క్యాన్సర్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Photo Credit: IANS

రొమ్ము క్యాన్సర్ అనగానే మహిళలకు వచ్చే వ్యాధి అని భావిస్తుంటాం. కానీ పురుషులకు కూడా ఈ భయంకరమైన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మగవారిలో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వృద్ధాప్యంలో సంభవిస్తుంది. యువకులకు ఉన్నప్పడు బ్రెస్ట్ క్యాన్సర్ చాలా అరుదగా వస్తుంది. ప్రారంభ దశలో మగవారికి రొమ్ము క్యాన్సర్‌ వచ్చినట్లు గుర్తిస్తే ట్రీట్‌మెంట్‌తో పూర్తిస్థాయిలో తగ్గించవచ్చు అయితే మగవారిలో చాలా కేసుల్లో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చేసి మాలిగంట్ టిష్యూను తొలగిస్తారు. 

ప్రతి ఏడాది మగవారిలో క్యాన్సర్ వ్యాధుల్లో ఒకశాతం రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. మధ్య , తూర్పు ఆఫ్రికాలో మగ రొమ్ము క్యాన్సర్ బాధితులు ఎక్కువ.  నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్, మెడికల్ ఆంకాలజీ విభాగం (ఐఓఎస్పీఎల్) సీనియర్ కన్సల్టెంట్ & విభాగాధిపతి డాక్టర్ కుమార్‌దీప్ దత్తా చౌదరి.. మగవారిలో ఈ క్యాన్సర్ కారణాలను షేర్ చేసుకున్నారు. 

జన్యు, కుటుంబపరమైర కారణాలు
వంశపారపర్యంగా రావడం. తండ్రికి, తమ పూర్వీకులకు ఎవరికైనా గతంలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉంటే తర్వాతి తరానికి వచ్చే అవకాశం 15-20శాతం ఉందన్నారు. వంశంలో గతంలో ఎవరికీ బ్రెస్ట్ క్యాన్సర్ లేని వారికి ఇది 7శాతం మాత్రమేనట. BRCA1 ఉత్పరివర్తనాల కంటే వారసత్వంగా వచ్చిన BRCA2తో ప్రమాదం ఎక్కువ.  PTEN ట్యూమర్ సప్రెసర్ జీన్ (కౌడెన్ సిండ్రోమ్), ట్యూమర్ ప్రోటీన్ p53 (TP53; లి-ఫ్రామెని సిండ్రోమ్), BRCA2 (PALB2)ల కారణంగానూ పురుషులకు ఈ క్యాన్సర్ వస్తుంది.

Also Read: మితిమీరిన తిండి, వ్యాయామం ఆరోగ్యానికి చేటు.. షాకింగ్ నిజాలు

ఈస్ట్రోజెన్, ఆండ్రోజెన్ నిష్పత్తిలో వ్యత్యాసం
హార్మోన్ థెరపీల వల్ల ఈస్ట్రోజెన్ (టెస్టోస్టిరాన్) హార్మోన్ అధిక మోతాదులో ఉత్పన్నం కావడం,  ఊబకాయం (స్థూలకాయం), గంజాయి తీసుకోవడం, థైరాయిడ్ వ్యాధి లేదా జన్యుపరమైన కారణాలతో వచ్చే ప్రమాదం ఉంది. వృషణాలలో ఇన్ ఫెక్షన్ ఓ కారణం అవుతుందన్నారు. అవగాహన లేకపోవడం వల్ల మగవారిలో రొమ్ము క్యాన్సర్‌ను ఆడవారిలోలాగ అంత త్వరగా గుర్తించలేం. ఆడవారికి చను ముచ్చికల్లో నొప్పి వస్తుంది కానీ మగవారిలో నొప్పి వచ్చినా అంతంతమాత్రమే. ఎడమ ఛాతిలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్పారు. 

చికిత్స
మహిళలకు చేసినట్లుగానే పురుషులకు చికిత్స అందిస్తారు. అయితే ఆడవారితో పోల్చితే ఛాతీ పరిమాణం చిన్నదిగా ఉండటం వల్ల వీరికి మైనర్ సర్జరీ చేస్తారు. హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ వ్యాధిలోపురుషులకు ఆర్మటేస్ ఇన్‌హిబిటర్ (AI) మోనోథెరపీ తప్పనిసరి అనే నిర్ధారణ లేనందున  సహాయక టామోక్సిఫెన్‌ను ఇస్తామని డాక్టర్ కుమార్‌దీప్ తెలిపారు. ఈస్ట్రోజెన్ల యొక్క వృషణ ఉత్పత్తిని AI థెరపీ తగ్గించలేదు. 12.5 శాతం మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లలో వేరే రకం క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. జీర్ణాశయ, క్లోమగ్రంధి క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..