మితిమీరిన తిండి, వ్యాయామం ఆరోగ్యానికి చేటు.. షాకింగ్ రిపోర్ట్

Health Benefits | మీరు మితిమీరి తింటున్నారా, లేక సమయానికి ఆహారం తీసుకోవడం లేదా.. వీటికి తోడు అధిక శారీరక శ్రమ చేస్తున్నారా అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని యూకే రీసెర్చ్ హెచ్చరిస్తోంది.

Updated: Jan 30, 2020, 10:49 AM IST
మితిమీరిన తిండి, వ్యాయామం ఆరోగ్యానికి చేటు.. షాకింగ్ రిపోర్ట్

ఆహారపు అలవాట్లు సరిగా లేని వారికి ఇతరుల కంటే ఎక్కువగా వ్యాయామం పట్ల ఆసక్తి కనబరుస్తారట. అయితే మితిమీరిన వ్యాయామం చేయడం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, మానసిక రుగ్మతలకు (డిప్రెషన్) దారితీస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. రీసెర్చ్‌లో కనుగొన్న అంశాలను ‘ఈటింగ్ అండ్ వెయిట్ డిజార్డర్స్ - స్టడీస్ ఆన్ అనోరెక్సియా, బులిమియా మరియు ఒబెసిటీ (ఊబకాయం) అనే జర్నల్‌లో ఈ విషయాలు ప్రచురించారు. సరైన ఆహారపు అలవాట్లు లేని, ఆహార నియమాలు పాటించని వ్యక్తులు ఫిజికల్ ఫిట్ నెస్, ఎక్సర్ సైజ్‌ వంటి విషయాలను వ్యసనంగా మార్చుకునే ప్రమాదం ఇతరులతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. వేళాపాళా లేని తిండి శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని రీసెర్చ్ చెబుతోంది. 

వేళాపాళా లేని ఆహారపు అలవాట్లు ఓ పనిని పదే పదే చేయాలనిపించే ‘ఒబెసివ్ కంపల్సివ్ బిహేవియర్స్’ అనే వ్యాధి బారిన పడతారని యూకేలోని అంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ (ఏఆర్‌యూ) ప్రొఫెసర్ మైక్ ట్రాట్ తెలిపారు. యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీకి చెందిన 2140 మంది ప్రాక్టీషనర్లు రీసెర్చ్ చేసి షాకింగ్ విషయాలు గుర్తించారు. వేళకు ఆహారం తీసుకునే వారితో పోల్చితే సరైన ఆహారపు అలవాట్లు లేని వ్యక్తులు ఎక్సర్‌సైజ్ కు అడిక్ట్ అయ్యే అవకాశాలు నాలుగు రెట్లు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం మారుతున్న జీవన విధానాలతో రోజురోజుకూ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని మైక్ ట్రాట్ ఆందోళన వ్యక్తం చేశారు.

మితిమీరిన శారీరక శ్రమ (వ్యాయాయం) కారణంగా చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు, ఎముకలు త్వరగా ఫ్రాక్చర్ కావడం లాంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. ఆహారపు అలవాట్లు మెరుగు పరుచుకుని, జీవనశైలిలో మార్పులు తెచ్చుకుంటే అనారోగ్య సమస్యల్ని అధిగమించడం సులువు అన్నారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..