Balloon Treatment: హైదరాబాద్‌లో తొలిసారిగా గుండె జబ్బులకు బెలూన్ చికిత్స

Balloon Treatment: గుండె జబ్బులకు ఇప్పుడు మరో సరికొత్త చికిత్సా విధానం విజయవంతంగా అమలవుతోంది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఆ చికిత్స జరిగింది. గుండె జబ్బులకు మంచి పరిష్కారంగా భావిస్తున్న ఆ చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 26, 2021, 01:32 PM IST
  • హైదరాబాద్ లో గుండె రోగులకు సరికొత్త చికిత్సా విధానం
  • దక్షిణ బారతదేశంలో తొలిసారిగా ఏఐజీ ఆసుపత్రిలో అమల్లోకొచ్చిన సైబర్ బెలూన్ ఎబ్లేషన్ విధానం
  • ఒక్కరోజులోనే చికిత్స చేసి డిశ్చార్జ్ చేసిన పరిస్థితి
Balloon Treatment: హైదరాబాద్‌లో తొలిసారిగా గుండె జబ్బులకు బెలూన్ చికిత్స

Balloon Treatment: గుండె జబ్బులకు ఇప్పుడు మరో సరికొత్త చికిత్సా విధానం విజయవంతంగా అమలవుతోంది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఆ చికిత్స జరిగింది. గుండె జబ్బులకు మంచి పరిష్కారంగా భావిస్తున్న ఆ చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం.

ఆధునిక జీవనశైలిలో గుండెజబ్బులు సర్వ సాధారణంగా మారిపోవడమే కాకుండా అన్ని వయస్సులవారికి ఎదురవుతోంది. ఎప్పటికప్పుడు గుండె జబ్బులకు అందించే చికిత్సా విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త చికిత్సా విధానాన్ని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో(AIG Hospital) విజయవంతంగా నిర్వహించారు. అదే సైబర్ బెలూన్ ఎబ్లేషన్ ప్రక్రియ. ఈ విధానాన్ని దక్షిణ భారతదేశంలో తొలిసారిగా నిర్వహించారు. సింపుల్‌గా బెలూన్ ట్రీట్‌మెంట్‌గా పిలుస్తారు. ఇప్పటికే ఇద్దరు రోగుల్ని ఈ కొత్త విధానంలో ఒక్కరోజులో చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేశాక రోజువారీ పనులు కూడా చేసుకోగలగడం ప్రత్యేకత. గుండె జబ్బులున్న రోగులకు ఈ విధానం సురక్షితమైందని..ముఖ్యంగా ఏట్రియల్ ఫైబ్రిలేషన్ అంటే ఏఎఫ్ఐబీ నయం చేసేందుకు ఎంతో తోడ్పడుతుందని ఏఐజీ వైద్యులు డాక్టర్ నరసింహన్ తెలిపారు. ఏట్రియల్ ఫైబ్రిలేషన్(AFIB Patients) రోగుల కోసం ప్రత్యేకంగా ఏఎఫ్ఐబీ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

ఏఎఫ్ఐబీ అంటే ఏమిటి(What is AFIB)

ప్రస్తుతం ఏఎఫ్ఐబీ 50 లక్షలకు పైగా భారతీయుల్ని వేధిస్తున్న సమస్యగా ఉంది. ముందు గుండోపోటు కల్గించి..తద్వారా గుండె ఆగిపోయేలా చేసే తీవ్రమైన అనారోగ్య పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించే విద్యుత్ ప్రేరణ..గుండెను వేగంగా కొట్టుకునేలా చేసి రక్త సరఫరాలో అంతరాయం కల్గిస్తుంది. రోగికి గుండె దడ, శారీరక బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురౌతుంది. మందులతో తగ్గకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ ఎబ్లేషన్ విధానంతో నియంత్రిస్తారు. అయితే ఈ విధానం ఉష్ణశక్తిని ఉపయోగించే సుదీర్ఘ ప్రక్రియ. అందుకే ప్రత్యామ్నంగా బెలూల్ ట్రీట్‌మెంట్(Cyber Balloon Ablation Treatment)అందుబాటులో కొత్తగా వచ్చింది. సైబర్ బెలూన్ ఎబ్లేషన్ విధానంలో క్రమరహిత హృదయ స్పందనను కల్గించే అసాధారణ హృదయ కణజాలాన్ని స్తబ్దుగా చేస్తుంది. సాంప్రదాయక పద్ధతి కంటే ఈ విధానంలో ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. తిరిగి వ్యాధి పునరావృతమయ్యే అవకాశాలు కూడా తక్కువే. గుండె రుగ్మత కలిగిన రోగుల్లో సైబర్ బెలూన్ ఎబ్లేషన్ విధానంలో ఎక్కువమంది కోలుకోవచ్చనేది వైద్య నిపుణులు చెబుతున్న మాట.

Also read: Health Tips for Bone Strength: ఎముకలు, కండరాల పటిష్ఠతకు ఈ ఆహారం తప్పనిసరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News