Cycling For Weight Loss: శీతాకాలంలో వ్యాయామాలు చేయడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు యోగాతో పాటు వ్యాయామాలు, సైక్లింగ్ చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో సైక్లింగ్ చేయడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఇటీవలే కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలిపారు. అయితే చలికాలంలో ప్రతి రోజు సైక్లింగ్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శీతాకాలంలో చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి తరచుగా అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఇలా తరచుగా శీతాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు వ్యాయామాలతో పాటు సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా కాళ్లు, మోకాళ్లు, చేతుల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా బీపీ, రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!
శీతాకాలంలో సులభంగా బరువు తగ్గాలనుకునేవారు సైక్లింగ్ ప్రతి రోజు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. హార్వర్డ్ హెల్త్ అధ్యయనం ప్రకారం..70 కిలోల బరువున్నవారు ప్రతి రోజు 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం వల్ల 252 కేలరీల తగ్గుతాయి. ముఖ్యంగా మహిళల్లో ఇలా ప్రతి రోజు చేయడం వల్ల సులభంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. దీంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది.
పురుషులు ప్రతి రోజు సైక్లింగ్ చేయడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కాళ్ల కండరాలు కూడా దృఢంగా మారుతాయి. కాబట్టి జిమ్ చేసేవారు కాళ్ల కండరాల దృఢత్వం కోసం ప్రతి రోజు సైక్లింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరం కూడా చురుకుగా తయారవుతుంది. అంతేకాకుండా మానసి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook