Viral Diseases: పాత సంవత్సరం దాదాపు ముగిసిపోతుంది ..ఇక కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ ఏడాది కాలం ప్రతి రంగంలో ఏదో ఒక కొత్త వార్త వైరల్ అయింది .అదే విధంగా ఆరోగ్య రంగంలో కూడా కొన్ని సరికొత్త విషయాలు వార్తల్లో నిలిచాయి. మరీ ముఖ్యంగా ఈ ఏడాది ప్రజలు ఎన్నో వ్యాధులు ఎదుర్కొన్నారు వీటిలో కొన్ని ఆందోళనలో కలిగించడమే కాకుండా ప్రాణ భయం కూడా పెంచాయి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మరి మనల్ని అంతగా భయపెట్టిన ఆ మహమ్మారలు ఏమిటో తెలుసుకుందాం పదండి..
కరోనా మహమ్మారి ఏమంటుందో మన మధ్యకు వచ్చిందో కానీ వచ్చిన క్షణం నుంచి ఇప్పటివరకు ఏదో ఒక రకంగా మనల్ని వెంటాడుతూనే ఉంది. ఇంకా పూర్తిగా మన మధ్య నుంచి మాయం కానీ ఈ వ్యాధి ఎప్పటికీ కూడా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంది. అయితే కేవలం కరోనా ఒక్కటే కాదు సంవత్సరం పలు రకాల మహమ్మారలు వెలుగులోకి వచ్చాయి. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం చివరిలో ఇండియాలోని జనాలను ఐదు వ్యాధులు ముఖ్యంగా భయపెట్టాయి.
డెంగ్యూ
డెంగ్యూ వ్యాధి అనేది దోమల వల్ల స్ప్రెడ్ అయ్యే ఒక ప్రాణాంతక వ్యాధి అన్న విషయం మనందరికీ తెలుసు అయితే ఇది కొత్తగా ఏమీ వచ్చిన వ్యాధి కాదు ఇంతకు ముందు కూడా దీన్ని మనం చూసాం కానీ ప్రతి ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దేశవ్యా ప్తంగా డెంగ్యూ కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి ఇది తీవ్ర రూపంలో విజృంభించడమే కాకుండా ఎన్నో ప్రాణాలను బలి తీసుకుని బీభత్సం సృష్టించింది.
కండ్లకలక
ఈ సంవత్సరం కండ్లకలక కేసులు కూడా ఎక్కువగా నమోదు అవ్వడం తో పాటు జనాలను బాగా ఇబ్బందికి గురి చేశారు. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే కంటి సంబంధిత ఈ ఇన్ఫెక్షన్ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చింది.
నిపా వైరస్
ఎప్పుడూ లేనివిధంగా ఈ సంవత్సరం నిఫా వైరస్ వ్యాప్తి కూడా జనాలను భయానికి గురిచేసింది. ఒక విధంగా చెప్పాలి అంటే కరోనా లాగా ఇది కూడా ఎక్కడ విజృంభిస్తుందో చాలా మంది భయపడిపోయారు. ఈ వైరస్ మొదట కేరళలో నిర్ధారణ అయ్యింది. గబ్బినాల ద్వారా వ్యాప్తి చెంది ఈ వైరస్.. ఒక ప్రాణాంతకమైన వైరస్.
రాబిస్
కుక్కల నుంచి.. కుక్క కాటు కారణంగా వ్యాపించే వైరస్ రాబిస్. ఎప్పటినుంచో ఈ వైరస్ గురించి మనకు తెలుసు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తతతో ఉంటారు. కుక్క కరిచినా.. గీకినా ..వెంటనే సంబంధిత ఇంజక్షన్లు తీసుకోవడం అందరికీ అలవాటు. అయితే కుక్క కాటు కారణంగా రాగిస్ వ్యాధి సోకి 14 సంవత్సరాల బాలుడు మృతి చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కుక్క కరిచింది అని ఆ బాలుడు ఇంట్లో వాళ్లకు సకాలంలో తెలియపరచలేదు.. ట్రీట్మెంట్ టైం కి అంది ఉంటే పరిస్థితి విషమం అయ్యేది కాదు. ఇలా ఈ సంవత్సరం రాబిస్ కూడా వార్తల్లో నిలిచింది.
న్యుమోనియా
కరోనా పుట్టినిల్లు చైనా తో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఇప్పటికీ కూడా ఎన్నో న్యుమోనియా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో అక్కడక్కడ వాకింగ్ న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. చైనాలో నమోదవుతున్న న్యుమోనియా కేసులకు మనకు ఎటువంటి సంబంధం లేదు. అయినా కానీ ఈ వ్యాధి గత కొంతకాలంగా వార్తల్లో నిలిచి వైరల్ అయింది.
మరి ఇవి వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ అవుతాయా లేక ప్రభావం తగ్గుతాయా అని అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం చివరలో కరోనా కేసులు పెరగడం కూడా అందరిలో మరోసారి ఆందోళన తెపిస్తోంది.
Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు
Also read: Vitamin D: విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలెదురౌతాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
ఈ ఏడాది కునుకు లేకుండా చేసిన మహమ్మార్లు ఇవే.. వచ్చే సంవత్సరం కూడా..