Diabetes Control In 7 Days: ప్రస్తుతం భారతదేశంలో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ వ్యాధికి ఇప్పటికీ ఎలాంటి ఔషధాలు లేకపోవడం విశేషం. అయితే చాలా మంది ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం ఆహారంపై శ్రద్ధ వహించకపోవడం.. ఆధునిక జీవనశైలి, పోషకాహారాలు తీసుకోకపోవడమేనని నిపుణులు పేర్కొన్నారు. మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఉండే ఆహారం తీసుకోవాలి.. కాకుండా ఆహారం తీసుకోవడానికి సమయ పద్ధతులు పాటించాలి. ఇలా చేయడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణం సమాంతరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం చాలామంది మధుమేహంతో బాధపడుతున్న వారు సరైన సమయాల్లో ఆహారాలు తీసుకోవడం లేదు అంతేకాకుండా ఉపవాసాలు కూడా చేస్తున్నారు. దీనివల్ల రక్తంలో చక్కెర పరిమాణం పెరగడం.. క్రమంగా తగ్గడం వంటి మార్పులు వస్తున్నాయి. ఇలా క్రమంగా జరిగితే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి. కావున వీరు సరైన సమయంల్లో ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించడం ఇంకా మంచిదని నిపుణులు పేర్కొన్నారు.
ఒకవేళ ఉపవాసాలు ఉంటే ఈ నియమాలు పాటించాలి:
1. మధుమేహంతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఉపవాసం చేసే రోజు వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకొని వాటిని పాటిస్తే చాలా మంచిది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల పాలయ్యే అవకాశాలున్నాయి. ఉపవాసాని కంటే ముందు వైద్యుడిని సంప్రదించడం అస్సలు మర్చిపోవద్దు.
2. ఉపవాస సమయంలో చాలామంది చెక్కరతో కూడిన వస్తువులను విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. మధుమేహం ఉన్నవారికి ఇది ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి. కావున ఉపవాసం చేసే క్రమంలో తీపి వస్తువులకు దూరంగా ఉండడం మీకే మంచిది. అంతేకాకుండా ఉప్పు అధిక పరిమాణంలో ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకుంటున్నారు. కావున ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి.. ఉప్పు చక్కర అధిక పరిమాణాలు ఉన్న కాలు తీసుకోకపోవడం చాలా మంచిది.
3. మధుమేహంతో పాటు రక్తపోటు, గుండె సమస్యలు ఉంటే ఉపవాసానికి దూరంగా ఉండటమే చాలా మంచిది. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యల గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉపవాసం చేసే క్రమంలో తప్పకుండా ఉదయం పూట కొంత ఆహారాన్ని అయినా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
4. ఉపవాసాలు చేయాలనుకుంటే తప్పకుండా మధుమేహం వ్యాధిగ్రస్తులు ఉదయం పూట డ్రై ఫ్రూట్స్ అల్పాహారంలో భాగంగా తీసుకోవాలి. ఇందులో అధిక పరిమాణంలో పోషకాలు ఉంటాయి కాబట్టి శరీరానికి మంచి ఎనర్జీ ని ఇస్తాయి. కావున తప్పకుండా ఈ నియమం పాటించాలి.
5. డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఉపవాసం చేసే క్రమంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం కోసం తప్పనిసరిగా నిమ్మరసం లేదా కొబ్బరినీళ్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం హెల్దీగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణం పెరగకుండా ఉంటుంది.
6. ఉపవాసం చేసే క్రమంలో మధుమేహం వ్యాధిగ్రస్తుడు తప్పకుండా రక్తంలో చక్కెర పరిమాణాన్ని చెక్ చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా వీరు నీటిని నాలుగు నుంచి ఐదు లీటర్లు తీసుకోవాలి. పై నియమాలు పాటిస్తూ వైద్యున్ని సంపాదించి మాత్రమే మధుమేహం వ్యాధిగ్రస్తులు ఉపవాసాన్ని చేయాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook