కడుపులో 5 కేజీల ఇనుప వస్తువులు; బయటకు తీసిన వైద్యులు

మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మన్సూద్ కడుపులో 263 నాణేలు, 12 షేవింగ్ బ్లేడ్లు, 4 పెద్ద మేకులు.. మొత్తం 5 కేజీల బరువును శస్త్ర చికిత్స ద్వారా బయటకు తీశారు డాక్టర్లు.

Last Updated : Nov 27, 2017, 12:29 PM IST
కడుపులో 5 కేజీల ఇనుప వస్తువులు; బయటకు తీసిన వైద్యులు

కేజీ బరువు ఎత్తడానికి అబ్బా ..! అనే రోజులు ఇవీ. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు కేజీల బరువు అదీ.. కడుపులో పెట్టుకున్నాడు ఇంకేమైనా ఉందా? 

మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి కడుపులో 263 నాణేలు, 12 షేవింగ్ బ్లేడ్లు, 4 పెద్ద మేకులు.. మొత్తం 5 కేజీల బరువును శస్త్ర చికిత్స ద్వారా బయటకు తీశారు డాక్టర్లు. 

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ సాత్నా జిల్లా సోహావాల్ ప్రాంతానికి చేసిన 32 ఏళ్ల మన్సూద్ తీవ్ర కడుపునొప్పి కారణంగా సంజయ్ గాంధీ హాస్పిటల్ లో చేరాడు. అతనికి పరీక్షలు.. వైగైరా వైగైరా చేయగా కడుపులో 5 కేజీల ఇనుప వస్తువులు ఉన్నాయని తెలిసిందని డాక్టర్ ప్రియాంక్ శర్మ చెప్పారు. ఆరుగురు వైద్యుల బృందం అతని కడుపులో ఉన్న 263 నాణేలు, 12 షేవింగ్ బ్లేడ్లు, 4 పెద్ద మేకులను శస్త్ర చికిత్స ద్వారా బయటకు తీశారు. మానసిక సమస్యల కారణంగా మన్సూద్ వీటిని రహస్యంగా మింగేవాడని డాక్టర్ ప్రియాంక్ చెప్పారు. 

Trending News