Natural packs for hair : ఈ సహజ ప్యాక్‌లు కురులకు ఎంతో మేలు

Natural packs for hair : కొందరికి జుట్టు ఊడుతూనే ఉంటుంది. కానీ కొన్ని సహజ కండిషనింగ్‌ ప్యాక్‌లను (Natural Conditioning‌ Packs) ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మరి అవి ఏమిటో ఒకసారి చూద్దామా.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2021, 08:46 PM IST
  • ఈ చిట్కాలతో జుట్టు రాలదు
  • ఇంట్లో ఉండే పదార్థాలతోనే ప్యాక్‌లు
  • మంచి ఫలితాలను ఇచ్చే సహజ కండిషనర్లు
Natural packs for hair : ఈ సహజ ప్యాక్‌లు కురులకు ఎంతో మేలు

Natural packs for hair : మనలో చాలామంది జుట్టు రాలకుండా (Hair fall) ఉండేందుకు రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు. అయినా కూడా సరైన ఫలితం ఉండదు. జుట్టు ఊడుతూనే ఉంటుంది. కానీ కొన్ని సహజ కండిషనింగ్‌ ప్యాక్‌లను (Natural Conditioning‌ Packs) ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మరి అవి ఏమిటో ఒకసారి చూద్దామా.

రెండు గుడ్లను తీసుకుని అందులోని తెల్లసోనాను (White egg) వేరు చేసుకోవాలి. అందులో చెంచా చొప్పున ఆలివ్‌నూనె (Olive oil) , వెనిగర్‌, తేనె వేసి బాగా కలపాలి. ఆపై ఆ మిశ్నమాన్ని జుట్టు కుదుళ్ల (Hair follicles) నుంచి చివర్ల వరకూ బాగా పట్టించాలి.  ఇలా చేసిన తర్వాత కాసేపు హెయిర్‌క్యాప్‌ పెట్టి ఉంచాలి. ఒక పది నిమిషాల తర్వాత గాఢత కాస్త తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి..

అరటి ఎంతో మేలు :

ఒక కప్పు అరటిపండు (Banana) గుజ్జులో కొద్దిగా పాలు, ఒక చెంచా చొప్పున తేనె, ఆలివ్‌నూనె, గుడ్డు కలిపి బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో తలకు ప్యాక్‌  వేసుకోవాలి. ఇది మంచి కండిషనర్‌లా (Conditioner‌) పనిచేస్తుంది. జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది.
ఒక చెంచా కొబ్బరి నూనెలో ఒక చెంచా చొప్పున తేనె, నిమ్మరసం, గులాబీనీరు, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలస్నానం  చేశాక జుట్టుకు రాసుకుంటే చాలా మెరుగ్గా పని చేస్తుంది. ఈ ప్యాక్‌ను అప్లై చేశాక రెండు నిమిషాల ఆగి మరోసారి చన్నీళ్లతో శుభ్రం చేస్తే సరి.

Also Read : Hair Loss: మీ జుట్టు రాలుతుంటే ఈ చిట్కాలతో సమస్య పరిష్కరించుకోండి

గోరింటాకుతో ప్యాక్ :

గోరింటాకు పొడిలో గుడ్డు,నిమ్మరసం, కాఫీ లేదా టీ డికాషన్, మందార ఆకులపొడి ఉసిరిపొడి కలుపుకొని ఓ అరగంట పాటు ఆ మిశ్రమాన్ని నానబెట్టి జుట్టుకు అప్లై చేయాలి. ఓ గంట అయ్యాక కడిగేయాలి అలాగే మెంతులు రాత్రివేళ పెరుగులో నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్ చేసి జుట్టుకు ప్యాక్‌లాగా వేసి అరగంట ఆగి వాష్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. 
మందార ఆకులూ, (Hibiscus leaves) మందాల పువ్వుల్లో ఔషధ గుణాల చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని గ్రైండ్ చేసి అందులో కొబ్బరినూనె కలసి జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలటం సమస్య చాలా వరకు తగ్గుతుంది . కొబ్బరినూనెలో కరివేపాకు వేసి మరగనిచ్చి జుట్టుకు పట్టించి తలస్నానం చేస్తే జుట్టు నల్లగా నిగనిగలాడుతోంది.

Also Read : Hair fall control, Dandruff: జుట్టు రాలడం: చుండ్రు వల్ల జుట్టు రాలుతుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News