Fruit Juices In Monsoon Season: వర్షా కాలంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోండిలా

Fruit Juices In Monsoon Season: సాధారణంగా పండ్ల రసాలు అంటే వేసవి సీజన్‌లో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడంతో పాటు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం కోసం మాత్రమే తాగుతుంటారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. కానీ వర్షాకాలంలోనూ కొన్నిరకలా పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ పండ్ల రసాలు ఏంటి ? అవి చేసే మేలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2023, 04:22 PM IST
Fruit Juices In Monsoon Season: వర్షా కాలంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోండిలా

Fruit Juices In Monsoon Season: సాధారణంగా పండ్ల రసాలు అంటే వేసవి సీజన్‌లో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడంతో పాటు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం కోసం మాత్రమే తాగుతుంటారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. కానీ వర్షాకాలంలోనూ కొన్నిరకలా పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ పండ్ల రసాలు ఏంటి ? అవి చేసే మేలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి.

కీర దోస జ్యూస్ :
కీర దోస రసంలో ఏ, బీ, సీ, కే విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు ఈ కీర దోస రసం ఎంతో ఉపయోగపడుతుంది. 

సోరకాయ జ్యూస్ : 
వర్షా కాలంలో సోరకాయ జ్యూస్ ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా జీర్ణ శక్తిని పెంచేందుకు సైతం సోరకాయ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. డైటింగ్ చేసే వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం.

కాకర కాయ రసం : 
కాకర కాయలు వర్షాకాలంలో విరివిగా లభ్యమయ్యే కూరగాయల్లో ఒకటి. కాకర కాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సీడంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి సీజనల్ జబ్బుల బారి నుంచి రక్షణ కల్పిస్తాయి అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. విటమిన్ సి, యాంటీఆక్సిడంట్స్ పుష్కలంగా ఉన్న ఏ ఆహారమైనా వర్షాకాలంలో సంక్రమించే జబ్బుల బారిన పడకుండా రక్షణ కవచంలా నిలుస్తుంది అని తెలిపారు.

బీట్రూట్ జ్యూస్ : 
ఒంట్లో రక్తం ఉండటం ఎంత ముఖ్యమో.. ఆ రక్తంలో హిమోగ్రోబిన్ ఉండటం కూడా అంతే ముఖ్యం అనే విషయం తెలిసిందే. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడంలో బీట్రూట్ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా వ్యాధినిరోధక శక్తి పెంచే ఫైబర్, విటమిన్ - c, పోటాషియం, ఐరన్ వంటి న్యూట్రియెంట్స్ కూడా ఇందులో అధిక మోతాదులో ఉంటాయి. అందుకే సీజనల్ వ్యాధులు ప్రభలే సమయంలో మీ డైట్‌లో ఇలాంటివి ఉండేలా చూసుకుంటే.. మీరు రోగాలను దూరం పెట్టినట్టే.

ఇది కూడా చదవండి : Kidney Cancer Symptoms: కిడ్నీ క్యాన్సర్ రావడానికి ముందు కనిపించే లక్షణాలు

రాడిష్ జ్యూస్ : 
రాడిష్‌లో విటమిన్ సి నిల్వలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా టిష్యూ రిపేర్ చేసి టిష్యూ గ్రోత్‌కి దోహదపడుతుంది.

టొమాటో జ్యూస్ : 
ఆహార పదార్థాల్లో రుచి కోసం ఉపయోగించే టమాటాలో మీకు తెలియని ఎన్నో సుగుణాలు ఉన్నాయి. టమాట జ్యూస్‌లో విటమిన్స్, యాంటీఆక్సీడంట్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ బూస్టర్స్‌గా పనిచేస్తాయి. 

ఇది కూడా చదవండి : Healthy Foods For Heart: గుండెకు మేలు చేసే ఫుడ్స్ తింటున్నారా లేదా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News