Fruits For High Blood Pressure: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ఆహారంలో మార్పులు, వ్యాయామం చేయకపోవడం.. ఇలా క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరు ఈ సమస్యల బారిన పడుతున్నారు.
ఈ పండ్లను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది:
అధిక రక్తపోటు అనేది జీవితాంతం కొనసాగే ఓ వ్యాధి. ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారితే.. మెదడులో రక్తస్రావం, పక్షవాతం వచ్చే అవకాశాలున్నాయి. కావున ఈ వ్యాధి రాకుండా మనం చాలా జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అధిక రక్తపోటును పలు రకాల పండ్ల ద్వారా నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ పండ్ల తింటే రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది:
1. అరటి పండు:
అరటి పండులో చాలా రకాల పోషకవిలువలుంటాయి. ఇది జీర్ణక్రియను బలపరిచి రక్తపోటుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తింటే రక్తపోటు అదుపులో ఉండి.. హార్ట్ స్ట్రోక్ నుంచి మిమ్మల్ని రక్షించేందుకు సహాయపడుతుంది.
2. కివి పండు:
కివిలో చాలా రకాల పోషక విలువలుంటాయి. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ బలంగా చేసి.. రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి.
3. మామిడి పండు:
మామిడి పండు పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. ఇది రుచికే కాదు.. అనేక వ్యాధులను దూరం చేస్తుంది. ముఖ్యంగా రక్తపోటు సమస్యతో బాధపడే వారికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్, ఫైబర్ ఆరోగ్యానికి చాలా లాభాలను ఇస్తాయి. అంతేకాకుండా పెరుగుతున్న బీపీని నియంత్రిస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Dehydration Symptoms On Skin: శరీరంలో నీరు కొరతగా ఉంటే ఈ చర్మ సమస్యలు తప్పవు..!
Also Read: Weight Gain Tips: బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook