Gas Trouble: అజీర్ణం, కడుపులోమంట, గ్యాస్ వంటి సమస్యలకు ఇలా చిటికెలో చెక్‌ పెట్టండి..

Gas Trouble Remedies: ప్రస్తుతం చాలామంది మారుతున్న జీవన శైలి కారణంగా వీధిలో లభించే ఆరోగ్యకరమైన ఆహారాలను విచ్చలవిడిగా తింటున్నారు. మరికొందరు మాత్రం రోజు ఆహారం తీసుకునే సమయంలో ఆహారాలు తీసుకోకపోతున్నారు.

Last Updated : Aug 23, 2022, 10:49 AM IST
  • అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారా
  • చిటికెలో ఉపశమనం పొందడానికి..
  • జిలకర్రతో చేసిన నీటిని తీసుకోండి
 Gas Trouble: అజీర్ణం, కడుపులోమంట, గ్యాస్ వంటి సమస్యలకు ఇలా చిటికెలో చెక్‌ పెట్టండి..

Gas Trouble Remedies: ప్రస్తుతం చాలామంది మారుతున్న జీవన శైలి కారణంగా వీధిలో లభించే ఆరోగ్యకరమైన ఆహారాలను విచ్చలవిడిగా తింటున్నారు. మరికొందరు మాత్రం రోజు ఆహారం తీసుకునే సమయంలో ఆహారాలు తీసుకోకపోతున్నారు. అయితే వీటి కారణంగా చాలామందిలో పొట్ట సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా చాలామందిలో గ్యాస్, ఆసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు.

 కావున రోజు పోషకాలు ఉన్న మంచి ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ సమస్యలు దూరం అవుతాయని మిగులు తెలుపుతున్నారు. పొట్టలో గ్యాస్ ఫామ్ అయినప్పుడు తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా చేసే పని సక్రమంగా చేయరు. కావున ఇలాంటి సమస్య నుంచి ఉపశమనం పొందడానికి సరైన పద్ధతుల్లో పలు నియమాలు పాటించడం చాలా మంచిది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ ను వాడుతున్నారు.

కానీ వీటివల్ల సరైన ఫలితాలు పొందలేకపోతున్నారు.  అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య నుంచి ఐదు నిమిషాల్లో ఉపశమనం పొందడానికి ఇంట్లో లభించే జీలకర్ర ప్రభావంతంగా పనిచేస్తుంది. అయితే దీనికోసం ముందుగా ఒక గ్లాసులో వేడి నీటిని తీసుకొని.. అందులో జీలకర్ర వేసి మరిగించాలి ఆ తర్వాత.. ఆ నీటిని తేనెతో పాటు తీసుకుంటే మంచి లాభాలు పొందడమే కాకుండా ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నీటిని రోజు ఉదయం పూట తీసుకుంటే శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్ అందటమే కాకుండా.. అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఆరోగ్యంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నవారు తక్షణ ఉపశమనం పొందడానికి.. ఈ నీటిని తప్పకుండా తీసుకోవాలని నిపణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News