Coconut Water Benefits: వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది డీహైడ్రేషన్ సమస్య, రక్తపోటు ఇతర సమస్యల బారిన పడుతుంటారు. డీహైడ్రేష్ కారణంగా సొమ్మసిల్లి పడిపోతుంటారు. ఈ సమయంలో చాలా మంది కూల్ డ్రింక్స్‌ని ఎక్కువగా తీసుకుంటారు. ఇవి మనం దప్పికను తీరుస్తాయి.. కానీ వీటిలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉండటం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యానిపుణలు చెబుతున్నారు.
అయితే ఈ సమయంలో మీరు మార్కెట్లో లభించే కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని వల్ల డీహైడ్రేష్ సమస్యలు తగ్గుతాయి.
అంతేకాకుండా కొబ్బరి నీళ్లలో మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి అనేక రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా వేసవిలో చర్మం సంరక్షణలో ఎంతో సహాయపడుతాయి.
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు:
డీహైడ్రేష్ నివారణ:
వేడి వాతావరణంలో శరీరం నుంచి నీరు వేగంగా పోతుంటుంది. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్స్తో నిండి ఉండి, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడతాయి.
ఎండ నుంచి ఉపశమనం:
ఎండ నుంచి దెబ్బతిన్నప్పుడు లేదా ఎండలో ఎక్కువ సమయం గడిపినప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహయపడుతుంది. చల్లటి, నట్టి రుచి దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యం:
వేడిమి జీర్ణ సమస్యలను పెంచుతుంది. కొబ్బరి నీళ్లలోని ఫైబర్ జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అసిడిటీ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
రక్తపోటు నియంత్రణ:
కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
Also Read: Migraine Relief: ఈ చిట్కాలతో మైగ్రేన్ సమస్య దూరం..! మీరు ట్రై చేయండి
శక్తి స్థాయిలను పెంచుతుంది:
వేసవిలో ఎండ వేడిమి శరీరాన్ని నీరసపరిచేస్తుంది. కొబ్బరి నీళ్లలోని సహజ చక్కెరలు శక్తి స్థాయిలను పెంచడానికి అలసటను తగ్గించడానికి సహాయపడతాయి.
మూత్రపిండాల ఆరోగ్య:
కొబ్బరి నీళ్లు మూత్రవిసర్జనను ప్రోత్సహించడం ద్వారా మూత్రపిండాలను శుభ్రపరచడానికి సహాయపడతాయి.
కొబ్బరి నీళ్లు సహజమైనవి, రుచికరమైనవి ఇది ఆరోగ్యకరమైన పానీయం. వేసవిలో తరచుగా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చల్లగా ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Also Read: Rooh Afza Recipe: వేడి వేసవికి చల్లని ఊరటని ఇచ్చే రూహ్ అఫ్జా షర్బత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter