Health Tips ఉదయం లేచిన వెంటనే పరగడుపున నీళ్లు తాగమని పెద్దలు చెబుతుంటారు. అదే నీళ్లలో కొద్దిగా నెయ్యి మిక్స్ చేసి తాగితే ఇక కలిగే అద్భుత ప్రయోజనాలు చాలా ఎక్కువ. మల బద్ధకం నుంచి స్థూలకాయం వరకూ, కొలెస్ట్రాల్ నుంచి రక్తపోటు వరకూ అన్ని సమస్యలకు చెక్ చెప్పవచ్చు.
నెయ్యిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి ఓ దివ్యౌషధం. ఇందులో ఉండే వివిధ రకాల పోషకాలు చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. నెయ్యిని చాలామంది వంటల్లో వినియోగిస్తారు లేక అన్నంలో కలుపుకుంటారు. కానీ రోజూ ఉదయం వేళ పరగడుపున నెయ్యి కలిపిన నీళ్లు తాగితే అద్భుతమైన లాభాలుంటాయి. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా నెయ్యిలో ఉండే పోషకాల కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజూ ఉదయం గోరు వెచ్చని నీళ్లలో ఒక్క చెంచా నెయ్యి కలుపుకుని తాగితే చాలు. తినే ఆహారం మంచిగా జీర్ణమౌతుంది. మలబద్ధకం వంటి ప్రధాన సమస్యలు తొలగిపోతాయి.
బరువు తగ్గించడంలో కూడా నెయ్యి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం నెయ్యిలో ఉండే హెల్తీ ఫ్యాట్స్..మెటబోలిజంను వేగవంతం చేస్తాయి.దాంతో బరువు తగ్గేందుకు దోహదమౌతుంది. చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. నెయ్యిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే క్రమం తప్పకుండా తీసుకోవాలి. అతిగా తీసుకోకూడదు.
నెయ్యితో కలిగే మరో అద్బుతమైన ప్రయోజనం ఇమ్యూనిటీ పెరగడం. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ ఎ, విటమిన్ డి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దరిచేరవు. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పెద్దమొత్తంలో ఉంటాయి. ఫలితంగా ఇవి మీ చర్మాన్ని మృదువు చేస్తాయి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ముఖంపై లేదా చర్మంపై ఉండే మచ్చలు, మరకల్ని తొలగిస్తుంది.
Also read: 6 Vitamins: 40 ఏళ్లు దాటాక పటిష్టంగా యౌవనంగా ఉండాలంటే ఏయే విటమిన్లు అవసరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook