ఉసిరి.. ఆరోగ్యానికి "సిరి"

ఉసిరికాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Last Updated : Nov 13, 2017, 07:23 PM IST
    • ఉసిరికాయ నిజంగానే మహా ఔషధం
    • పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఉసిరి అవసరం ఉంది
    • ఒక రకంగా చెప్పాలంటే ఉసిరి సర్వరోగ నివారిణి, కాకపోతే పరిమితిలోనే తీసుకోవాలి.
ఉసిరి.. ఆరోగ్యానికి "సిరి"

ఉసిరికాయ... అంటే కేవలం చిన్నపిల్లలు తినడానికి పనికొచ్చే ఫలమో.. కాయో అని భావిస్తున్నారా.. కాదండీ బాబూ..! మంచి ఆరోగ్య సిద్ధికి పిల్లలతో పాటు పెద్దవారికి కూడా ఎంతో ఉపయోగకరం ఇది. మరి ఈ రోజు మనం కూడా ఈ ఔషధ ఫలం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం

  • శరీరం పటుత్వం కోల్పోకుండా, బలంగా ఉండాలంటే ఉసిరి తినాల్సిందే. చ్యవనప్రాశ లేహ్యంతో కలిపిన ఉసిరికాయ గుజ్జును తింటే మీ బలం పెరగడానికి అదే మహా ఔషధం
  • ఉసిరిలో విటమన్ సి ఉంటుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఎండబెట్టిన ఉసిరిపండ్ల చూర్ణంలో పసుపు ఒక గ్రాము, తేనె ఒక గ్రాము వేసుకొని రోజూ తింటే, షుగర్ వ్యాధి దూరమవునని కొందరు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. 
  • శరీరంలో రోగ నిరోధక శక్తి  పెరగడానికి ఉసిరి ఎంతగానో తోడ్పడుతుంది. ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణమండలం మొదలైన వాటి సమస్యలకు తగ్గించడానికి ఉసిరి ఎంతగానో దోహదపడుతుంది.
  • కంటి బాధలు ఉన్నవారు ఒక స్పూన్ ఉసిరి రసం, అర టీస్పూన్ తేనె కలిసి తాగితే రోజూ తాగితే ఆ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
  • ఉసిరిలో ఉండే ఫైబర్ వల్ల పేగు కదలికలు మెరుగుపడి, జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది.
  • ఎండిపోయిన ఉసిరికాయతో బెల్లం కలిసి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆస్త్మా, బ్రోంచైటిస్ అనే వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఒక ఉసిరికాయ రెండు నారింజపండ్లతో సమానం అనే నానుడి కూడా ఉంది.
  • ఉసికి కాయ జ్యూస్ రోజూ తాగడం వల్ల మూత్రనాళ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా యూనినర్ బర్నింగ్‌ను పారద్రోలడంలో ఉసిరి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
  • ఆడపిల్లల్లో నెలసరి సమస్యలు తగ్గించడానికి కూడా ఉసిరికాయ రసం ఎంతగానో తోడ్పడుతుంది.
  • మొటిమల నివారణకు కూడా ఉసిరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫేషియల్ చేసుకుంటున్నప్పుడు ఉసిరికాయ పొడిని మిక్స్ చేసి ముఖానికి అద్దుకోవడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. 
  • అయితే ఉసిరిని తగుమాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే అనర్థాలు కూడా ఉన్నాయి సుమండీ.. అందుకే ఉసిరిని ఆహారంలో కొద్ది భాగంగానే తీసుకోవాలి తప్పితే.. ఎక్కువగా ఇష్టం వచ్చినట్లు తినకూడదు.

Trending News