Health Benefits of Raisins: ఎండుద్రాక్షతో కలిగే లాభాలేంటో తెలిస్తే..ఆశ్చర్యపోతారు

Health Benefits with Raisins : సకల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఎండు ద్రాక్ష. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా లభించే ఎండు ద్రాక్షను పరిమితంగా తింటే..ఏ అనారోగ్య సమస్య మిమ్మల్ని వెంటాడదు. ఎండు ద్రాక్షతో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Last Updated : Jan 27, 2021, 03:02 PM IST
Health Benefits of Raisins: ఎండుద్రాక్షతో కలిగే లాభాలేంటో తెలిస్తే..ఆశ్చర్యపోతారు

Health Benefits with Raisins : సకల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఎండు ద్రాక్ష. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా లభించే ఎండు ద్రాక్షను పరిమితంగా తింటే..ఏ అనారోగ్య సమస్య మిమ్మల్ని వెంటాడదు. ఎండు ద్రాక్షతో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రకృతిలో రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో సీజన్‌లో లభ్యమవుతుంటాయి. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా లభించేవి కూడా ఉన్నాయి. వీటిలో లభించే ఔషధ గుణాల గురించి చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు. అందులో ఒకటి ఎండు ద్రాక్ష ( Raisins ). ఇది ఏడాది పొడుగునా దొరుకుతుంది. కిస్‌మిస్ ( Kishmish ) లేదా ఎండు ద్రాక్షగా పిల్చుకునే వీటిలో విటమిన్స్ ( Vitamins ), మినరల్స్, ఫైబర్ ( Fiber ) పుష్కలంగా ఉంటాయి. అంతకుమించి ఎండు ద్రాక్ష ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ( Raisins as Best Anti Oxidant ) ‌గా పని చేస్తుంది. ఎండు ద్రాక్ష పరిమితంగా తింటే ఫ్యాట్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా దరి చేరవు. ఎండుద్రాక్ష ఏయే సమస్యలకు చెక్ పెడుతుందో తెలుసుకుందాం.

Also read: Hair Loss: మీ జుట్టు రాలుతుంటే ఈ చిట్కాలతో సమస్య పరిష్కరించుకోండి

జీర్ణప్రక్రియ ( Digestion ) ను మెరుగుపర్చుకోడానికి ఎండుద్రాక్ష చాలా ఉపయోగపడుతుంది. ఇందులో పైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం పోయి..తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. పేగులు, పొట్టలో విష వ్యర్ధాలుంటే పోతాయి. మరోవైపు ఎసిడిటీకు ( Acidity ) ఎండు ద్రాక్షలు చెక్ పెట్టగలవు. ఇందులో ఉండే ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియంలు కడుపులో ఉండే యాసిడ్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. దాంతో ఎసిడిటీ తలెత్తదు. 

గుండె ( Raisins good for Heart ) కు ఎండుద్రాక్ష చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎండుద్రాక్షలో ఉండే పొటాషియం కండరాలు..గుండె కండరాల కణాలకు మేలు చేకురుస్తుంది. ఎండు ద్రాక్ష రెగ్యులర్‌గా తింటే గుండె సంబంధిత సమస్యలు రావు. అన్నింటికంటే ముఖ్యం ప్రాణాంతకమైన కేన్సర్‌కు ( Raisins can check to cancer ) చెక్ పెట్టవచ్చు. ఎండుద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్ కణాల్ని నిలువరిస్తాయి. చర్మకణాల్లో ప్రవేశించే కేన్సర్‌ను ప్రారంభంలోనే నిలువరించగలవు. కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా, పుండ్లు పెరగకుండా ఆపగలవు. 

Also read: Ginger health benefits: అల్లం రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

కంటి ( Eye care ) మేలు చేస్తాయి ఎండుద్రాక్ష. ఇందులో ఉండే పాలీ ఫెనాల్స్ అనే ఓ ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ కళ్లను కాపాడుతుంది. కేటరాక్ట్ సమస్యకు పరిష్కారం ఎండుద్రాక్షే. అటు చర్మానికి ఇవి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, సెలెనియం, జింక్‌లు యాంటీ ఏజీయింగ్ ప్రాసెస్‌లో పని చేస్తాయి. చర్మం ( Raisins benefits for skin ) పాడవకుండా, చర్మ కణాలు దెబ్బ తినకుండా చేస్తాయి. తద్వారా ముసలితనం రాకుండా చేయగలవు. అయితే ఇన్ని ప్రయోజనాలున్నాయి కదా అని పరిమితికి మించి తినకూడదు. రోజుకు 15-20 తీసుకుంటే చాలు. 

Also read: Throat Pain: గొంతు నొప్పికి చెక్ పెట్టాలంటే ఈ Health Tips పాటించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News