Weakness Tips: శారీరక బలహీనతకు కారణాలేంటి, బలంగా ఉండాలంటే ఏం చేయాలి

Weakness Tips: శారీరకంగా బలంగా ఉండటమే అసలైన ఆరోగ్యం. శారీరకం బలహీనత అనారోగ్యంతో సమానం. ఆధునిక జీవనశైలిలో అతి ప్రధాన సమస్య ఇదే. డైట్‌లో మార్పులతో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 8, 2022, 11:31 PM IST
Weakness Tips: శారీరక బలహీనతకు కారణాలేంటి, బలంగా ఉండాలంటే ఏం చేయాలి

Weakness Tips: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజువారీ బిజీ లైఫ్‌స్టైల్, వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి. సరైన ఆహారం తినకపోవడంతో శారీరక బలహీనత ఎదురౌతుంది. ఎప్పుడైతే శారీరక బలహీనత ఉంటుందో..ఏ పని కూడా సవ్యంగా జరగదు. శారీరక బలహీనత అనేది అనారోగ్యంతో సమానం. అందుకే శారీరకంగా బలంగా ఉండాలి. 

ముఖ్యంగా మగవారికి లైంగిక విషయాల్లో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు మీ డైట్ మార్చుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని చేర్చుకోవాలి. అలా చేస్తే శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. శారీరక బలహీనతను దూరం చేసేందుకు డైట్‌లో ఏయే ఆహార పదార్ధాలు చేర్చుకోవాలో తెలుసుకుందాం..

శారీరక బలహీనతకు కారణమేంటి

విటమిన్ బి 12 లోపం కారణంగా శారీరక బలహీనత తలెత్తుతుంది. డిప్రెషన్, ఆందోళన కూడా శారీరక బలహీనతకు కారణాలు. ఏదైనా వ్యాధి కారణంగా కూడా శారీరక బలహీనత ఎదురుకావచ్చు. శారీరక బలహీనతను దూరం చేసేందుకు సీజనల్ పండ్లు, కూరగాయలు తప్పకుండా డైట్‌లో చేర్చాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా అవసరం. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్ల వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. శరీరంలో అవసరమైనంత నీరు లేకపోయినా..బలహీనత ఉంటుంది. 

శారీరక బలహీనత దూరం చేసేందుకు లీన్ ప్రోటీన్లతో పుష్కలంగా ఉన్న పదార్ధాల్ని తీసుకోవాలి. దీనికోసం ఫ్రూట్స్ తప్పకుండా తినాలి. లీన్ ప్రోటీన్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరంలో బలహీనత ఉంటే..నట్స్, విత్తనాలు ఎక్కువగా తీసుకోవాలి. నట్స్‌లో కేలరీలు తక్కువగా ఉన్నందున సులభంగా జీర్ణమౌతాయి. రోజూ నట్స్ తీసుకుంటే..మీ బలహీనత క్షణాల్లో దూరమౌతుంది. 

వీటితో పాటు రోజూ సరైన వ్యాయామం చాలా అవసరం. వాకింగ్, యోగా, సైక్లింగ్, ఎక్సర్‌సైజ్ ఇలా ఏదో రూపంలో శరీరం ఫిట్‌గా ఉంచేందుకు ప్రయత్నించాలి.

Also read; Diabetic Care: మధుమేహం నియంత్రణకై ఐదు అద్భుతమైన ఔషధాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News