Ginger For Health: వంటలలో వాడే అతి ముఖ్యమైన పదార్థాల్లో అల్లం ఒకటి. కూరల్లో రుచి, వాసన కోసం దీనిని ఉపయోగిస్తారు. అల్లం (Ginger benefits) తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అనేక రకాల వ్యాధులను దరిచేరనివ్వదు. అంతేకాకుండా ఇది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా కడుపులో మంట, అజీర్తి, అల్సర్లు, దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది డయాబెటిక్ పేషెంట్లకు వరమనే చెప్పాలి. కాబట్టి అల్లం తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి డయాబెటిక్ రోగులు పరిమిత పరిమాణంలో అల్లం తీసుకోవాలని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మీరు రోజుకు 4 గ్రాముల అల్లం తింటే అది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో మరియు ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు అధికంగా తీసుకుంటే గుండెల్లో మంట, అతిసారం లేదా ఉదర సంబంధిత వ్యాధులు రావచ్చు.
అల్లం ఇతర ప్రయోజనాలు
>> మైగ్రేన్ నొప్పి ఎక్కువగా ఉన్నవారు దీనిని తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా పచ్చి అల్లం తినడం వల్ల ఎక్కువ లాభం పొందుతారు.
>> కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో అల్లం చాలా బాగా పనిచేస్తుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
>> దంత సమస్యలు, నోటి దుర్వాసనను పోగొట్టడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది.
>> ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook