Sandalwood Benefits: చందనంతో ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలో తెలుసా?

Sandalwood Health Benefits:  చందనం అంటే సువాసన గల చెక్క అని అర్థం. చందనంతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2022, 10:15 AM IST
Sandalwood Benefits: చందనంతో ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలో తెలుసా?

Sandalwood Health Benefits: చర్మ నిగారింపు కోసం కొన్ని వేల సంవత్సరాలుగా చందనంను ఉపయోగిస్తున్నారు. ఈ చందనాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఈ చందనం (Sandalwood) పట్టువేసుకుంటే చలువ చేసి.. తలనొప్పి తగ్గుతుందని నమ్ముతారు. ఈ చందనాన్ని శాంటాలేసి, శాంటాలమ్ జాతికి చెందిన మెుక్కల నుంచి వచ్చే కలప ద్వారా దీనిని తయారు చేస్తారు. ఈ మెుక్కలను మన తెలుగు రాష్ట్రాల్లో గంధపు చెట్లు అంటారు. చందనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం. 

చందనం ఆరోగ్య ప్రయోజనాలు
>> చర్మానికి మెరుపు, మృదుత్వాన్ని అందించడంలో చందనం అద్బుతంగా పనచేస్తుంది. 
>> చందనంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఇవి మీకు ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా ఇవి అల్సర్ల చికిత్సలో కూడా ఉపయోగపడతాయి. 
>> శాండల్‌వుడ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్స్, సెడేటివ్ మరియు సూథింగ్ ఎఫెక్ట్స్ వంటివి మెదడును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అందువల్ల నిద్ర రుగ్మతలు, అల్జీమర్స్ వంటి వ్యాధులు రావు. 
>> చందనంలో ఆల్ఫా-శాంటలోల్ అనే రసాయనం ఉందని... ఇది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా చర్మ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో గంధపు  చెక్క అద్భుతంగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. 
>> గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. 
>> మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయకారిగా ఉంటుంది.
>> చందనంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మెుటిమలను తొలగిస్తాయి. 
>> సోరియాసిస్‌ రాకుండా ఇది అడ్డుకుంటుంది. 

చందనం దుష్ప్రభావాలు
చందనం వల్ల దురద, మూత్రపిండాలు దెబ్బతినడం, మూత్రంలో రక్త రావడం వంటి సమస్యలు వస్తాయి. వెంటనే వైద్య సహాయం తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 

Also Read: Aloevera Health Benefits: అల్లోవెరా వెనిగర్ ఏయే చికిత్సల్లో ఉపయోగిస్తారు, కలిగే లాభాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News