ఆశ్చర్యంగా ఉందా.. కానీ నిజమే. కాకరకాయతో టీ ఏంటని నోరెళ్లబెట్టవద్దు. ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు చాలా రకాల పద్ధతులు పాటిస్తుంటారు. కానీ కాకరకాయ టీ ఎప్పుడూ ప్రయత్నించి ఉండరు కదా. ఆ వివరాలు తెలుసుకుందాం..
కాకరకాయ చేదు కారణంగా చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కాకరకాయతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాకరకాయ ఆరోగ్యానికి మంచిదని..తినమని పదే పదే ఇంట్లో పెద్దలు చెబుతూనే ఉంటారు. చేదును తప్పించేందుకు ఎన్నిరకాలుగా వండినా కాకరకాయ అంటే దూరం జరుగుతూనే ఉంటారు. ఆరోగ్యానికి మంచిదని తెలిసినా తినేందుకు ఇష్టపడరు. కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జ్యూస్ వల్ల శరీరం అంతర్గతంగా క్లీన్ అవుతుంది. దీనివల్ల చాలా వ్యాధుల్నించి రక్షణ పొందవచ్చు. చాలా చేదుగా ఉండటంతో అందరూ తాగలేరు. అందుకే కాకరకాయతో హెర్బల్ టీ తయారు చేసుకుంటే చేదు తగలకుండా తాగవచ్చు.
కాకరకాయ హెర్బల్ టీ ఎలా చేయాలి
కాకరకాయ అనేది ఓ హెర్బల్ టీ. కాకరకాయ స్లైసెస్ నీళ్లలో వేసి చేస్తారు. కొద్దిగా తేయాకు రుచి కోసం వేసి..కాకరకాయను ముక్కలుగా కోసి నీటిలో మరిగించాలి. ఆ తురవాత వడకాచి..కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుంటే కాకరకాయ టీ తయారైనట్టే. దీనిని ఔషధ టీగా పిలుస్తారు. కాకరకాయ టీ పౌడర్ కూడా లభ్యమౌతుంది. గోహ్యా టీ అని కూడా పిలుస్తారు. ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కాకరకాయ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. వీటి సహాయంతో రక్తంలో చెడు కొలెస్త్రాల్ క్లీన్ చేయవచ్చు. దీనికోసం కాకరకాయ టీ రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
Also read: Detox Foods: శరీరాన్ని ఎందుకు డీటాక్స్ చేయాలి, డీటాక్స్ చేసే పద్ధతులేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook