Hemoglobin Deficiency: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కావల్సింది పోషకాలు. మనం తినే ఆహార పదార్ధాల ద్వారా శరీరానికి కావల్సిన పోషకాలు అందుతుంటాయి. ప్రతిరోజూ శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్ ఏ మాత్రం తక్కువైనా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి.
మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపించే వివిధ రకాల అంశాల్లో రక్తం ఒకటి. రక్తం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తంలో హిమోగ్లోబిన్ తగిన మోతాదులో ఉండాలి. హిమోగ్లోబిన్ ఏ మాత్రం తక్కువైనా నీరసం, అలసట, ఏ పనీ చేయలేకపోవడం ఉంటాయి. తినే ఆహార పదార్ధాల ద్వారా హిమోగ్లోబిన్ లోపాన్ని సరిచేయవచ్చు. హిమోగ్లోబిన్ లోపం సమస్య నుంచి గట్టెక్కేందుకు డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలి. హిమోగ్లోబిన్ లోపం ఎంత జటిలమైన సమస్యంటే చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఎదురౌతుంది. ఎందుకంటే హిమోగ్లోబిన్ అనేది రక్తపు కణాల్లో ఉండే ఐరన్ ఆధారిత ప్రోటీన్. శరీరంలోని అన్ని అంగాలకు ఆక్సిజన్ సరఫరా ఇదే చేస్తోంది. అందుకే సాధ్యమైనంతవరకూ ఐరన్ పుష్కలంగా ఉండే తోటకూర, గోంగూర, గుడ్లు, పాలకూర, బీట్‌రూట్ వంటి పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా కీలకమని భావించాలి.
హిమోగ్లోబిన్ లోపాన్ని సరిచేసేందుకు వాల్‌నట్స్ చాలా ముఖ్యం. ఇందులో న్యూట్రియంట్లు ఎక్కువగా ఉంటాయి. గుప్పెడు వాల్‌నట్స్‌లో 0.82 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. అందుకే వాల్‌నట్స్ అనేవి హిమోగ్లోబిన్ లోపానికి సరైన పరిష్కారం. ఇక మరో డ్రై ఫ్రూట్ పిస్తా. గుప్పెడు పిస్తాలు తీసుకుంటే 1.11 మిల్లీ గ్రాములు ఐరన్ దొరుకుతుంది. రోజూ పిస్తా తినడం అలవాటు చేసుకుంటే ఐరన్ లోపం తలెత్తదు.
ఇక బాదం డ్రైఫ్రూట్స్‌లో రారాజుగా చెప్పవచ్చు. అద్భుతమైన పోషక విలువలున్న డ్రైఫ్రూట్ బాదం. బాదం రోజూ తినడం అలవాటు చేసుకుంటే కేవలం హిమోగ్లోబిన్ సమస్యను తీర్చడమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా సమస్యలు దూరమౌతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇక జీడిపప్పు మరో అద్భుతమైన డ్రై ఫ్రూట్. దాదాపు చాలా రకాల వంటల్లో జీడిపప్పుని ఉపయోగిస్తారు. గుప్పెడు జీడిపప్పు తీసుకుంటే అందులో 1.89 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది.
Also read: Diabetes Diet: మధుమేహం తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడే పదార్ధమిదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Hemoglobin Deficiency: రక్తంలో హిమోగ్లోబిన్ ఎందుకు అవసరం, ఏయే ఆహార పదార్ధాలు తినాలి