Walnuts Benefits: రోజుకు కొన్ని వాల్‌నట్స్ తింటే చాలు ఈ వ్యాధులు దరిచేరవు

Walnuts Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మనిషి ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైనవి వాల్‌నట్స్. రోజూ క్రమం తప్పకుండా వాల్‌నట్స్ తీసుకుంటే ఆ రెండు వ్యాధులు దూరమౌతాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 7, 2024, 11:02 PM IST
Walnuts Benefits: రోజుకు కొన్ని వాల్‌నట్స్ తింటే చాలు ఈ వ్యాధులు దరిచేరవు

Walnuts Benefits: వాస్తవానికి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దాదాపు అన్ని రకాల పోషక పదార్ధాలు పుష్కలంగా ఉండాలి. ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవి కావాలంటే డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలి. ఇందులో ముఖ్యమైంది వాల్‌నట్స్.

డ్రై ఫ్రూట్స్‌లో అత్యంత శక్తివంతమైనవి వాల్‌నట్స్. ఇందులో ఉండే పోషక విలువల కారణంగా ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలుగుతుంది. వాల్‌నట్స్‌లో ఉండే పోషకాల కారణంగా అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల్నించి రక్షించుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్లాంట్ స్టేరోల్, ఎల్ ఆజినిన్ వంటి పోషకాలు గుండె ఆరోగ్యానికి చాలా లాభదాయకం. వాల్‌నట్స్ వల్ల కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు, రక్తపోటు తగ్గించేందుకు, రక్త నాళికల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తాయి. గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది. 

వాల్‌నట్స్‌లో ఉండే ఫైబర్, హెల్తీ ఫ్యాట్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడతాయి. మధుమేహం వ్యాధిగ్రస్థులకు అద్భుతంగా పనిచేస్తుంది. వాల్‌నట్స్‌లో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. అంటే ఇన్సులిన్ వినియోగం సరిగ్గా ఉండేట్టు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు బ్రెయిన్ సెల్స్‌ను సురక్షితంగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. 

వాల్‌నట్స్‌లో కేలరీలు అధికంగా ఉన్నా ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్ కారణంగా బరువు నియంత్రణలో ఉంటుంది. వాల్‌నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం మెటబోలిజం వేగవంతమౌతుంది. దాంతో కేలరీలు వేగంగా కరుగుతాయి. వాల్‌నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు కావల్సిన శక్తి లభిస్తుంది. ఆస్టియో పోరోసిస్ వంటి సమస్యలను నిర్మూలించవచ్చు. 

వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. శరీరంలో ఫ్రీ రాడికల్స్ కారణంగా జరిగే నష్టాన్ని నివారిస్తాయి. కేన్సర్ ముప్పును తగ్గిస్తాయి. వాల్‌నట్స్‌లో ఉండే మెగ్నీషియం కారణంగా ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ట్రిప్రోటఫేన్ అనే ఎమైనా యాసిడ్ శరీరంలో సెరిటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో మూడ్ స్వింగ్ బాగుంటుంది. 

Also read: ICAI CA 2024 Results: ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News