Morning Diet: మెరుగైన ఆరోగ్యం అనేది చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహార పదార్ధాలు, జీవనశైలి రెండూ బాగుండాలి. ఏ ఒక్కటి చెడినా అనారోగ్యం వెంటాడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని ఉదయం వేళ తీసుకోకూడదు. లేకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ ఆరోగ్యం లేదా ఫిట్నెస్ అనేది ఉదయం తీసుకునే ఆహారంతోనే ప్రారంభమౌతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ బాగుంటే అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని ఉదయం వేళల్లో తీసుకోకూడదు. ఉదయం కడుపు ఖాళీగా ఉంటున్నందున..ఆ పరిస్థితుల్లో ఏది తిన్నా సరే నేరుగా కడుపు లోపలి భాగాలపై పడుతుంది. ఫలితంగా కడుపులో మంట, కడుపు నొప్పి, ఛాతీలో మంట, అజీర్ణం వంటి సమస్యలు ఎదురౌతాయి. ఉదయం వేళ ఏం తినకూడదో చూద్దాం..
ఉదయం వేళల్లో మసాలా లేదా ఫ్లైడ్ పదార్ధాలు తినకూడదు. దీంతో కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. ఫైబర్ పదార్ధాలు కడుపుకి మంచివే. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే ఫైబర్ పదార్ధాలు తీసుకోవాలి.
ప్రతిరోజూ ఉదయం లేవగానే కొంతమందికి కాఫీ లేదా టీ తాగుతుంటారు. కానీ దీనివల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. కానీ చల్లని నీల్లు అస్సలు తాగకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎదురై..ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది.
ఉదయం పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ప్రమాదకరం. ఇది నేరుగా మీ లివర్‌పై ప్రభావం చూపిస్తుంది. మీ రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుంది. పైన సూచించినవన్నీ కేవలం సురక్షితంగా ఉండేందుకు మాత్రమే.
Also read: Google Pixel Launch: గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో ప్రీ బుకింగ్ రేపట్నించే, ధర ఎంత, ఫీచర్లు ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook