Cholesterol Problem: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి, నిద్ర లేకపోవడం, ఫాస్డ్ ఫుడ్, జంక్ పుడ్ వంటివి చెడు కొలెస్ట్రాల్‌కు కారణమౌతుంటాయి. కొలెస్ట్రాల్ పెరగడమంటే అర్ధం శరీరంలో సమస్యలు పెరగడమే. కొలెస్ట్రాల్ దూరం చేయడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది.
కొలెస్ట్రాల్ అనేది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఇదొక్కటే శరీరంలో వివిధ సమస్యలు కారణమౌతుంటుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఈ ముప్పును ఎదుర్కోవాలంటే తక్షణం డైట్‌లో కొన్ని పదార్ధాలు చేర్చడం, కొన్నింటిని దూరం చేయడం అవసరం. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్ కాగా, రెండవది మంచి కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే రక్తపోటు సమస్య ఉత్పన్నమౌతుంది. అందుకే కొన్ని పదార్ధాలను తక్షణం డైట్ నుంచి దూరం చేయాలి.
నో మీట్ ఫుడ్
ఎక్కువ మోతాదులో మాంసం తినేవాళ్లు తక్షణం తగ్గించుకోవాలి లేదా దూరం పెట్టాలి. లేకపోతే కొలెస్ట్రాల్ సమస్య మరింతగా పెరుగుతుంది. మాంసం తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ పెరిగిందో హార్ట్ ఎటాక్ ముప్పు అధికమౌతుంది.
నో టు చికెన్
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు తక్షణం చికెన్ సేవించడం తగ్గించాలి. అవసరమైతే పూర్తిగా మానేయడం మంచిది. చికెన్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. చికెన్ దూరం పెట్టకపోతే ఆరోగ్యం పాడవుతుంది.
పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తులు కూడా ఆరోగ్యపరంగా మంచివి కావు. చాలామంది రోజువారీ ఆహారంలో పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అందుకే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్లు పాల ఉత్పత్తులకు దూరం పెట్టాలి.
Also read: Litchi Benefits: డైట్‌లో ఈ ఒక్క సమ్మర్ ఫ్రూట్ ఉంటే చాలు, జీవక్రియ మెరుగుపడి అన్ని సమస్యలు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook