Health Tips: కిచెన్‌లో ఉండే ఈ స్లో పాయిజన్ పదార్ధాలు వెంటనే దూరం చేయండి లేకపోతే ప్రాణాలు తీస్తాయి

Health Tips: ఇంటి భోజనం ఎప్పుడూ ఆరోగ్యకరమైందే. కానీ కిచెన్‌లో ఉండే కొన్ని వస్తువులు మీ ఆరోగ్యంపై విషంలా పనిచేస్తాయనే విషయం మీకు తెలుసా. ఆ వివరాలు తెలుసుకుందాం. ఏయే వస్తువులు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 25, 2023, 03:54 PM IST
Health Tips: కిచెన్‌లో ఉండే ఈ స్లో పాయిజన్ పదార్ధాలు వెంటనే దూరం చేయండి లేకపోతే ప్రాణాలు తీస్తాయి

ఇంటి భోజనం అన్నింటికంటే ఉత్తమం అనే విషయంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. కానీ కొన్ని వస్తువులతో మాత్రం దూరం పాటించాల్సిందే. లేకపోతే ఇవి మీ శరీరంపై స్లో పాయిజన్‌లా పనిచేస్తాయి. నెమ్మదిగా మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే అలాంటి వస్తువుల్ని తక్షణం మీ కిచెన్ నుంచి దూరం చేయాలి. కిచెన్ నుంచి దూరం చేయాల్సిన ఆ వస్తువుల వివరాలు మీ కోసం..

ఆరోగ్యానికి హానికరం ఈ వస్తువులు

మైదా

చోళే భటూరేలోని భటూరే లేదా పూరీ, లేదా బజ్జీలు అన్ని మైదాతోనే తయారవుతుంటాయి. కానీ ఈ పదార్ధంతో జీర్ణ సంబంధ సమస్యలైన మలబద్ధకం, అజీర్తి, స్వెల్లింగ్‌లకు కారణమౌతుందని చాలామందికి తెలియదు. ఈ సమస్యల్ని ఉపశమనం పొందాలంటే తక్షణం మైదాకు దూరంగా ఉండాల్సిందే. లేకపోతే చాలా వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడతాయి.

ఆయిల్

అవసరానికి మించి ఆయల్ ఉపయోగించడం వల్ల గుండె పోటు, కేన్సర్, డయాబెటిస్, కీళ్ల నొప్పుల వంటి వ్యాధులు ఉత్పన్నమౌతాయి. అందుకే ఆయిల్ వినియోగాన్ని ఎంతవీలైతే అంత తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ మీ ఆరోగ్యాన్ని నెమ్మది నెమ్మదిగా పాడు చేస్తుంటుంది. అందుకే ఆయిల్ వినియోగం తగ్గించాలి.

ఉప్పు

కిచెన్‌లో లభ్యమయ్యే ఉప్పు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రుచి కోసం అన్నింటిలోనూ తప్పకుండా వినియోగించే పదార్ధమిది. కానీ ఉప్పు అనేది ఆరోగ్యంపై స్లో పాయిజన్‌లా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే సోడియం పరిమాణం పెరిగితే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అంతేకాదు..నిర్ణీత వయస్సుకు ముందే వృద్ధాప్య ఛాయలు ఎదురౌతాయి.

వైట్ బ్రెడ్

ఇక చాలామంది వైట్ బ్రెడ్ ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్‌తో కలిపి మరీ లాగిస్తుంటారు. వైట్ బ్రెడ్ ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. వైట్ బ్రెడ్ అనేది కేవలం మైదాతోనే తయారౌతుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ తక్కువగా ఉంటాయి. అంతేకాదు..బ్రెడ్ వల్ల బరువు కూడా పెరుగుతారు.

పంచదార

పంచదార అతిగా తీసుకుంటే ప్రమాదకరమైన స్లో పాయిజన్‌లా పనిచేస్తుంది. ఎందుకంటే పంచదార తయారీలో చాలావరకూ రిఫైండ్ చేయాల్సి ఉంటుంది. దాంతో ఇందులో ఉండే పోషకాలన్నీ నష్టపోతాయి. అందుకే పంచదారను సాధ్యమైనంతవరకూ తగ్గించేయాలి.

Also read: Raisins Benefits: పీరియడ్స్ సమయంలో మహిళల సమస్యలు, ఆరోగ్యం కోసం అద్భుత ఔషధమిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News