Woman Health Tips: నెలసరి సమయంలో మహిళలు బొప్పాయి తినవచ్చా లేదా, తింటే ఏమౌతుంది

Woman Health Tips: దేహ నిర్మాణం, ఆరోగ్యం, బలం విషయంలో మహిళలకు, పురుషులకు తేడా ఉంటుంది. దీనికి తోడు కొన్ని ఇతర సమస్యలు కూడా మహిళలకు తలనొప్పిగా మారుతుంటాయి. సృష్టి ధర్మమే అయినా ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో మహిళల డైట్ పుష్ఠికరంగా ఉండాలంటారు వైద్యులు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 20, 2023, 06:16 PM IST
Woman Health Tips: నెలసరి సమయంలో మహిళలు బొప్పాయి తినవచ్చా లేదా, తింటే ఏమౌతుంది

Woman Health Tips: ప్రతి నెలా మహిళలకు ఎదురయ్యే సమస్య నెలసరి. నెలసరి వస్తుందంటే చాలు..మహిళల్లో ఓ రకమైన ఆందోళన అధికమౌతుంటుంది. బలహీనత ఆవహిస్తుంది. పెయిన్స్ ఉంటాయి. భరించలేని నీరసం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. 

పీరియడ్స్ సమయంలో మహిళలకు నొప్పి ఎక్కువగా ఉంటుంది. మరోవైపు రక్తస్రావం కారణంగా నీరసం అధికమౌతుంది. ఇవి చాలదన్నట్టు అసహజత్వం, మూడ్ స్వింగ్ కావడం ఇలా వేర్వేరు సమస్యలు వెంటాడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆకలి అధికంగా ఉంటుంది. కొన్ని సార్లు ఏం తినాలన్పించదు. అందుకే ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని రకాల పదార్ధాలు తీసుకోవాలి. పీరియడ్స్ సమయంలో ఎలాంటి డైట్ అవసరమో పరిశీలిద్దాం. పీరియడ్స్ సమయంలో కొన్ని పండ్లు నొప్పి నుంచి ఉపశమనం  కల్గిస్తాయి. కొన్ని అదే నొప్పిని పెంచుతాయి. అందుకే ఏది తినకూడదు, ఏది తినాలో తెలుసుకోవాలి. బొప్పాయి విషయంలో నెలసరిలో ఉన్న మహిళలకు ఎప్పుడూ ఓ సందిగ్దత ఉంటుంది. బొప్పాయి మంచిదో కాదో తేల్చుకోలేకపోతుంటారు.

నిపుణుల సూచనల ప్రకారం గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం మంచిదే. కానీ పచ్చి బొప్పాయి అస్సలు తినకూడదు.  వాస్తవానికి పచ్చి బొప్పాయిలో లేటెక్స్, పెపైన్ అధికంగా ఉంటుంది. ఇవి గర్భాశయం సంకోచనాన్ని ప్రేరేపిత చేసి తీవ్రమైన ఎలర్జీ, త్వరగా పురిటి నొప్పులు వచ్చేలా చేస్తుంది. అందుకే పీరియడ్స్ సమయంలో బొప్పాయి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

బొప్పాయితో ప్రయోజనాలు

బొప్పాయి తినడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. బొప్పాయి గర్భాశయ కండరాల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చి నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. బొప్పాయిలో ఉండే కేరటీన్ ఇందుకు దోహదపడుతుంది. రోజూ తగిన మోతాదులో బొప్పాయి తీసుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉంటాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ నియంత్రిస్తుంది. 

బొప్పాయిలో ఉండే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఆరోగ్యానికి ప్రయోజనకరం. ముఖ్యంగా పీరియడ్స్ సమస్య ఎదుర్కొనే మహిళలకు ఉపయోగమౌతాయి. అంటే పీరియడ్స్ సమయంలో బొప్పాయి ఆరోగ్యకరమైందే. బొప్పాయితో ప్రయోజనాలు ఎక్కువే ఉన్నాయి. పచ్చి బొప్పాయి మాత్రం మంచిది కాదు. 

Also read: Risks of Eating Too Fast: త్వర త్వరగా ఆహారాలు తింటున్నారా ఇక అంతే సంగతి, ఈ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడక తప్పదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News