Tulsi Benefits: తులసి ఆకుల్లో ఓలియానోలిక్ యాసిడ్‌తో ఈ 16 వ్యాధులు మటుమాయం

Tulsi Benefits: హిందూమతంలో తులసి మొక్కకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అందుకే దాదాపుగా ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది. అయితే కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా తులసి మొక్కతో చాలా ప్రయోజనాలున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 29, 2023, 05:02 PM IST
Tulsi Benefits: తులసి ఆకుల్లో ఓలియానోలిక్ యాసిడ్‌తో ఈ 16 వ్యాధులు మటుమాయం

Tulsi Benefits: హిందూమతంలో తులసి మొక్కకు ప్రాధాన్యత ఉన్నట్టే ఆయుర్వేద శాస్త్రంలో తులసి మొక్కకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్ని రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తాయి.

తులసి మొక్క ఆకులు కడుపుకు చాలా మంచివి. కడుపులో మంట, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. అంతేకాకుండా శరీరంలో పీహెచ్ స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. తులసి మొక్కలో ఉండే ప్రధాననమై కెమికల్ కాంపౌండ్స్ ఓలేనోలిక్ యాసిడ్, ఉసోలిక్ యాసిడ్, రోస్మారినిట్క యాసిడ్, యూజేనాల్, కార్వాక్రోల్, లినాలూల్, , బీటా క్యారియోఫిలిన్‌లు చాలా ఏళ్ల నుంచి ఆహారపు ఉత్పత్తులు, అత్తరు, టీత్ అండ్ ఓరల్ ప్రొడక్ట్స్‌లో పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఓలేనోలిక్ యాసిడ్‌తో చాలా రకాల వ్యాధులు దూరం చేయవచ్చు. 

తులసి ఆకులు రోజూ నమిలి తినడం లేదా తులసి ఆకుల నీళ్లు తాగడం వల్ల నిద్రలేమి సమస్య పోతుంది.  తులసిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా తలపోటు, మైగ్రెయిన్ వంటి సమస్యలు దూరమౌతాయి. తులసిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలు, పింపుల్స్, యాగ్జిమా, సోరియాసిస్ చికిత్సలో అద్బుతంగా ఉపయోగపడతాయి.

తులసిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్ గుణాలు ఎక్కువ. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. మరీ ముఖ్యంగా కేన్సర్ నిరోధక గుణాలు తులసి ఆకుల్లో చాలా ఎక్కువ. కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నియంత్రిస్తాయి. తులసిలో ఉండే యాంటీ హైపర్‌టెన్సివ్ గుణాల కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బీపీ రోగులకు చాలా మంచిది. 

తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరం ఇమ్యూనిటీ పెంచేందుకు అద్బుతంగా ఉపయోగపడుతుంది. తులసిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, డైజెస్టివ్ గుణాల కారణంగా కడుపులో మంట, అజీర్తి, ఎసిడిటీ వంటి  సమస్యలు తలెత్తవు. జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం, బ్రోంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు దూరమౌతాయి.

Also read: Diabetes Control Fruits: తీపిగా ఉన్నా బ్లడ్ షుగర్ నియంత్రించే అద్భుతమైన పండ్లు ఇవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News