Winter Health Tips: శీతాకాలంలో సాధారణంగా చలి నుంచి కాపాడుకోవడం కోసం స్వెట్టర్లు, దళసరి దుస్తులు ధరించడం చాలా కామన్. బాహ్య శరీరాన్నికాపాడుకోవడంపై చాలా శ్రద్ధ చూపించే చాలా మంది.. ఆరోగ్యం విషయంలో చాలా పొరపాట్లు చేస్తుంటారు.
చలి నుంచి తక్షణ ఉపశమనం కోసం చాలా మంది టీ, కాఫీలు ఎక్కువగా తాగటం వంటివి చేస్తుంటారు. మరి ఇది ఎంత వరకు మంచిది? శీతాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి ఆహారాన్ని ఈ కాలంలో తీసుకోవాలి? ఈ విషయాలన్నింటిపై నిపుణుల సూచనలు, సలహాలు మీకోసం.
నీళ్లు తక్కువగా తాగటం..
చలికాలం అనగానే ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏమిటంటే.. సరిపడన్ని నీళ్లు తాగకపోవడం. ఎలాగు చలిగా ఉంది కదా ఎక్కువగా నీళ్లు తాగటం అవసరమా? అనుకుంటారు చాలా మంది. అయితే అలా చేయడం తప్పంటున్నారు ఆరోగ్య నిపుణులు. సీజన్ ఏదైనా కావాల్సినన్ని నీళ్లు తాగటం మంచిదంటున్నారు.
చాలినన్ని నీళ్లు తాగి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం (Drinking Enough Water) అవసరమని చెబుతున్నారు. ఎందుకంటే.. హైడ్రేషన్ వల్ల శరీర ఊష్టోగ్రత అదుపులో ఉండటమే కాకుండా.. రోగ నిరోధకతను పెంచడం, చర్మం నిగనిగలాడేలా చేస్తుందని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
కెఫిన్ అధికంగా తీసుకోవడం..
వాతావరణ చల్లగా ఉంటం వల్ల.. చాలా మంది ప్రతి రోజూ సాధారణం కన్నా ఎక్కువగా కాఫీ, టీలు తాగుతుంటారు. దీని వల్ల శరీరంలో కెఫిన్ మోతాదు పెరిగే అవకాశముంటుందని ఆరోగ్య నిపుణులు (Common Diet Mistakes in Winter) చెబుతున్నారు. దీని వల్ల డీ హైడ్రేషన్, నిద్ర లేమి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తొచ్చని చెబుతున్నారు. అందువల్ల ఆరోగ్యం స్థిరంగా ఉండాలంటే.. కెఫిన్ మోతాదు అదుపులో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
జంక్ ఫుడ్ అధికంగా తినడం..
చలికాలం వచ్చిదంటే చాలా మంది.. జంక్ ఫుడ్ అధికంగా తినేందుకు ఇష్టపడతారు. చాలా మంది ఇలా ఇష్టంగా తిన్నప్పటికీ.. అది అనేక ఆరోగ్య సమస్యలకు (Junk Food in Winter) దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘ కాలిక సమస్యలకు దారి తీయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే వీలైనంత తక్కువగా జంక్ ఫుడ్ తినాలని చెబుతున్నారు.
అధిక కార్బ్ తీసుకోవడం..
చలికాలంలో సెరోటోనిన్ (మన మానసిక స్థితికి కారణమయ్యే హార్మోన్) స్థాయిలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. అందువల్ల మనకు ఎక్కువగా.. కార్బోహైడ్రేట్ తీసుకోవాలనే కోరిక కలుగుతుందని చెబుతున్నారు. అయితే అలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడంద్వారా.. దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు (Health issues in Winter) వస్తాయని.. అందుకే కార్బోహైడ్రైట్లపై అదుపు అవసరమని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
సూప్ తయారీలో తప్పులు..
శీతాకాలంలో వేడి వేడి సూప్ తీసుకునేందుకు కూడా చాలా మంది ఇష్టపడతారు. అయితే సూప్ తయారీలో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారని నిపుణులు అంటున్నారు.
శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను సూప్‌లో కలపడం మంచిదని చెబుతున్నారు.
దానితో పాటు.. శీతాకాలంలో లభించే ఆహారపదార్థాలన్నింటిని తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అంటే ఏ సీజన్లో పండే పండ్లు, కూరగాయలను తినడం ద్వారా ఆ సీజన్‌కు కావాల్సిన రోగ నిరోధక శక్తి లభిస్తుందని (Winter healthy Food) చెబుతున్నారు.
Also read: Omicron Symptoms in Kids : చిన్న పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా కరోనానే!
Also read: Food for Daibetes patients: బ్లడ్ షుగర్ లెవల్స్ సడెన్‌గా పడిపోతే.. ఈ ఐదు ఫుడ్స్ తీసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Winter Health Tips: చలికాలంలో పాటించాల్సి ఐదు ఆరోగ్య సూత్రాలు..
శీతాకాలంలో తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు ఏవి?
టీ, కాఫీలు ఎక్కువగా తాగితే ఏమవుతుంది?
చలికాలంలో నీళ్లు ఎక్కువగా తాగొద్దా?