Millets Benefits: ఈ మధ్య అందరి దృష్టి చిరుధాన్యాల మీద పడింది. ఎందుకంటే కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వీటిని తినడం మెుదలుపెట్టారు. అంతేకాకుండా 2023 సంవత్సరాన్ని యూఎన్ఓ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఒకప్పుడు వీటిని బాగానే తినేవారు. రానురానూ వీటి వాడకాన్ని బాగా తగ్గించేశారు. ఈ చిరు ధాన్యాలనే సిరి ధాన్యాలు లేదా తృణ ధాన్యాలు అని కూడా అంటారు. కొర్రలు, రాగులు,సజ్జలు, సామలు, అరికలు, ఊదలు, అండు కొర్రలు వీటినే మిల్లెట్స్ అని పిలుస్తారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో తగిన మెుత్తంలో ఫైబర్ ఉంటుంది. అందుకనే వీటిని సూపర్ పుడ్స్ అని పిలుస్తారు.
మిల్లెట్స్ బెనిఫిట్స్
** కొర్రల్లో పైబర్ తోపాటు ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇది ప్రెగ్నంట్ లేడీస్ కు చాలా మంచిది. కొర్రలు మలబద్దకాన్ని దూరం చేస్తుంది. దీనిని తగిన మెుత్తంలో తీసుకోవడం వల్ల మూర్చ తగ్గుతుంది. ఆస్తమా, చర్మ సమస్యలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ ను నిరోధిస్తుంది.
** అరికలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎముకల్లో గుజ్జు ఏర్పడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్, వైరల్ ఫీవర్స్, ప్రోస్టేట్ సమస్యలు ఉన్నవారు వీటిని తింటే ప్రయోజనం కలుగుతుంది.
** సామలు తినడం హెల్త్ కు మంచిది. దీనిని తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. సంతాన సమస్యలు తీరుతాయి. థైరాయిడ్, క్లోమ గ్రంథి సమస్యలు ఉన్నవారు వీటిని తినడం వల్ల ఉపయోగం ఉంటుంది.
** ఊదలు తినడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ దూరం అవుతుంది. ఇది కామెర్లుకు చెక్ పెడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్లను అడ్డుకుంటుంది.
** మూలశంక, ఫిషర్స్, అల్సర్లు, మెులలు ఉన్నవారు అండుకొర్రలు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
Also read: Ulcer Home Remedies: ఈ ఇంటి చిట్కాతో నోటి పూతలకు 50 నిమిషాల్లో చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.