Heart Attack: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు కొందరికి జన్యుపరంగా వస్తే మరికొందరికీ ఆహారం అలవాట్లలో మార్పుల వల్ల వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గుండె జబ్బు చాలా మందిలో ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి ఆహారం అలవాట్లు, మారుతున్న జీవన శైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. వీటి ద్వారా కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని చాలా పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి ఏ రకమైన శస్త్రచికిత్సల వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయో తెలుసుకుందాం..
వీటి వల్ల గుండె పోటు ప్రమాదం ఎక్కువ:
న్యూయార్క్‌లోని వైద్య నిపుణులు తెలిపిన అధ్యాయనాల ప్రకారం..షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మోకాలి, తుంటి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని అధ్యాయనాల్లో తెలింది.
ఈ శస్త్రచికిత్సలకు ఎలా దారి తీస్తుంది:
ఈ తరహా సర్జరీ చేయించుకున్న తర్వాత దీర్ఘకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ప్రమాదం ఉంటుందని పరిశోధన ఫలితాలు తెలుపుతున్నాయి. మృదులాస్థి, ఎముకలు దెబ్బతినడం వల్ల ఈ శస్త్రచికిత్సలకు దారి తీస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
బోస్టన్ విశ్వవిద్యాలయం తెలిపిన వివరాలు:
అమెరికాకు చెందిన బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఈ అంశాలపై పరిశోధన చేసింది. మెడిసిన్, ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ యుకింగ్ జాంగ్ మాట్లాడుతూ.. ఎముక వ్యాధి ఉన్న వారు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి జాయింట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కానీ ఇది గుండె సంబంధిత సమస్యలపై ప్రభావం చూపుతుందని వారు పేర్కొన్నారు.
రక్తం గడ్డకట్టడం:
కీళ్ల జాయింట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ ఎముక వ్యాధిగ్రస్తుల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందో యుక్వింగ్ జాంగ్ పరిశోధన నిర్ణయిస్తుందని పేరొంది. తుంటి మార్పిడి వల్ల రక్త నాళాలలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook