Gold Price Today: పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి!

May 23rd 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330గా ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 07:31 AM IST
  • మహిళలకు శుభవార్త
  • నేటి బంగారం-వెండి రేట్లు ఇవే
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
 Gold Price Today: పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి!

Today Gold and Silver Rates in different cities in India: దేశంలో బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో గోల్డ్ నిల్వ, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు లాంటి ఇలా కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే బంగారానికి మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తారు కాబట్టి.. ధరలు పెరిగినా వ్యాపారాలు జోరుగానే కొనసాగుతూ ఉంటాయి. తాజాగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. 

దేశంలో రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం (మే 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,050లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై.. 24 క్యారెట్ల ధరపై కూడా ఎలాంటి మార్పులు లేవు. మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 61,400గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఎలాంటి మార్పు లేదు.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,330గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,330గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,170గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,550 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,050.. 24 క్యారెట్ల ధర రూ. 51,330గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 47,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,330గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,050 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,330గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 47,050.. 24 క్యారెట్ల ధర రూ. 51,330గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,330 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,900లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో మాత్రం రూ.61,400లుగా ఉంది. 

Also Read: Horoscope Today May 23 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఇల్లు కొనాలని చూస్తున్న ఆ రాశుల వారికి శుభకాలం!

Also Read: Omicron: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్స్... తమిళనాడులో బీఏ.4, తెలంగాణలో బీఏ.5 వేరియంట్ గుర్తింపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News