Bypass Surgery Diet: ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల ముప్పు బాగా పెరిగిపోయింది. ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా గుండె వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా బైపాస్ సర్జరీలు పెరుగుతున్నాయి. బైపాస్ సర్జరీ చేయించిన తరువాత ఆరోగ్యం, డైట్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
గుండె బైపాస్ సర్జరీ తరువాత ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఆహారం, జీవనశైలి సక్రమంగా ఉండాలి. ఎందుకంటే రక్తనాళాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి. చెత్త పదార్ధాలు లేదా కొవ్వు చేరకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనికోసం డైట్ ముఖ్యమైంది. కొన్ని రకాల పదార్ధాలను డైట్ నుంచి పూర్తిగా తొలగించడం మంచిది. ముఖ్యంగా ఆయిలీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. పాల ఉత్పత్తులు కూడా కొవ్వు తక్కువ ఉన్నదే తీసుకోవాలి. ఫ్యాట్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకుంటే రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది.
అందుకే బైపాస్ సర్జరీ తరువాత వీలైనంతవరకూ వెజిటేరియన్ ఫుడ్ బెస్ట్ . తేలికపాటి శరీరానికి మేలు చేసే ఆహారం మాత్రమే తినాలి. బ్రోకలీ, పొట్లకాయ, చేదుగా ఉండే కాకరకాయ, ఆకాకరకాయ వంటివి తినడం ఆరోగ్యానికి సదా మంచిది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ప్రోసెస్డ్ ఆహారం, మాంసాహారం కొన్ని నెలలు మానేయడమే మంచిది. ఒక్కమాటలో చెప్పాలంటే అరుగుదల సులభంగా ఉండే పదార్ధాలు తీసుకోవాలి. ఫ్యాట్, మసాలా పదార్ధాలకు దూరంగా ఉండాలి
స్వీట్స్ అనేది కేవలం డయాబెటిక్ రోగులకే కాదు ఇతరులకు కూడా మంచిది కాదు. బైపాస్ సర్జరీ తరువాత స్వీట్స్‌కు దూరంగా ఉంటే మంచిది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది ఉప్పు పరిమాణం తగ్గించేయాలి. రక్తపోటు పెరగకుండా చూసుకోవాలి. బైపాస్ సర్జరీ రోగులకు సాల్ట్ ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.
Also read: Flight Luggage Rules: కొత్త విమానం లగేజ్ రూల్స్ , ఎన్ని ఎలాంటి బ్యాగ్‌లకు అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.