Heart Attack Symptoms: సకాలంలో గుండెపోటు ముప్పును గుర్తించే అతి ముఖ్యమైన 7 లక్షణాలివే

Heart Attack Symptoms: గుండె శరీరంలోని అతి ముఖ్యమైన అంగం. ఆ గుండె ఆరోగ్యంగా లేకపోతే హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటివి ప్రాణాంతకంగా మారవచ్చు. కొన్ని ప్రధాన లక్షణాలతో గుండెపోటు ముప్పును ముందే ససిగట్టవచ్చు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 19, 2022, 01:31 PM IST
Heart Attack Symptoms: సకాలంలో గుండెపోటు ముప్పును గుర్తించే అతి ముఖ్యమైన 7 లక్షణాలివే

Heart Attack Symptoms: మీ గుండె ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చేముందు శరీరంలో కొన్ని లక్షణాలు కన్పిస్తాయి. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం..

  • హార్ట్ ఎటాక్ ప్రధాన లక్షణం ఏ కారణం లేకుండానే ఒళ్లంతా చెమట్లు పట్టడం. ఈ పరిస్థితి ఎదురైతే తక్షణం వైద్యుడిని సంప్రదించాలి.
  • తల తిరగడానికి చాలా కారణాలున్నా..హార్ట్ ఎటాక్ సందర్భంలో కూడా తల తిరుగుతుంది. వైద్యుడిని సంప్రదిస్తే మంచిది
  • వాంటింగ్ సెన్సేషన్ అనేది హార్ట్ ఎటాక్ ప్రారంభ లక్షణాల్లో ఒకటి. ఛాతీలో మంట, వాంతులు, కడుపు నొప్పి కూడా ఇతర లక్షణాలు
  • గురక నిద్ర అనేది ఎప్నియా అనే ఓ వ్యాధి లక్షణం. గుండెపై ఒత్తిడి పెరిగితే గురక వస్తుంది. ఇది మంచి అలవాటు కాదు.
  • ఎక్కువ కాలం దగ్గు ఉండటం, తెలుపు లేదా గులాబీ రంగులో కఫం రావడం హార్ట్ ఎటాక్ లక్షణాలు
  • ఛాతీలో నొప్పి మెడ, జబ్బల వరకూ వ్యాపిస్తే అలర్ట్ కావల్సిందే. ఇది కచ్చితంగా హార్ట్ ఎటాక్ లక్షణం
  • ఛాతీలో పట్టేసినట్టుండటం, నొప్పి, ఒత్తిడి అనేది గుండె నాళిక బ్లాకేజ్ లేదా హార్ట్ ఎటాక్ లక్షణం
  • ఛాతీలో ఎడమవైపు నొప్పిగా ఉండి..చేతుల వరకూ పాకితే కచ్చితంగా హార్ట్ ఎటాక్ లక్షణం 
  • కాళ్లు, పాదాలు, మడమల్లో స్వెల్లింగ్ ఉంటే గుండెకు రక్త సరఫరా సరిగ్గా అవడం లేదని అర్దం.
  • కొద్దిగా నడిచినా, మెట్లెక్కినా, కొద్దిగా సామాను మోసినా అలసట అధికంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది గుండెపోటు లక్షణం కావచ్చు.
  • మీ హార్ట్ రేట్ అకారణంగా పెరుగుతుంటే చింతించాల్సిన విషయమే. ఇలా ఉన్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Also read: Hair Care Tips: మీ కేశాలు బలంగా, ఆరోగ్యంగా మెరుస్తూ ఉండాలంటే..ఇది రాస్తే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News