Heart Diseases Tests: గుండె వ్యాధుల ముప్పు తెలుసుకునేందుకు ఏ పరీక్షలు చేయించుకోవాలి

Heart Diseases Tests: ఇటీవలి కాలంలో గుండె వ్యాధులు సమస్య పెరిగిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సులవారిని టార్గెట్ చేస్తోంది. గుండె వ్యాధుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 30, 2024, 06:51 PM IST
Heart Diseases Tests: గుండె వ్యాధుల ముప్పు తెలుసుకునేందుకు ఏ పరీక్షలు చేయించుకోవాలి

Heart Diseases Tests: మెదడు, కిడ్నీ, కంటి సమస్యలపై గుండె వ్యాధుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. శరీరంలోని ఈ అవయవాల పనితీరును గుండె వ్యాధులు ప్రభావితం చేస్తుంటాయి. అందుకే గుండె వ్యాధుల్ని సకాలంలో గుర్తించగలగాలి. గుండె వ్యాధుల్ని గుర్తించేందుకు చాలా పరీక్షలున్నాయి. వీటిద్వారా ఎప్పటికప్పుడు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం. 

ఎమైనో టర్మినల్ ప్రో బ్రెన్ నాట్రిప్యూరిటిక్ పెప్టైడ్. ఇదొక రకమైన ప్రోటీన్. రక్తంలో ఉంటుంది. గుండెపై ఒత్తిడి పెరిగినప్పుడు గుండె వ్యాధికి సంకేతమౌతుంది. ఒకవేళ రక్త పరీక్షలో ముప్పు ఎక్కువగా ఉందని తేలితే కొన్ని రకాల ఇమేజింగ్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అందులో ఈసీజీ, ఈకో కార్డియోగ్రఫీ, ఒత్తిడి పరీక్ష, కరోనరీ యాంజియోగ్రఫీ వంటివి చేయాలి. మరో పరీక్ష సీ రియాక్టివ్ ప్రోటీన్. అంటే సీఆర్పీ టెస్ట్. ఇది రక్తంలో స్వెల్లింగ్ ఎలా ఉందో చెబుతుంది. స్వెల్లింగ్ ఉంటే గుండె వ్యాధికి సంకేతం కావచ్చు. 

ఇక లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే కొలెస్ట్రాల్ పరీక్ష. ఇది అందరికీ తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. ఇందులో ట్రై గ్లిసరాయిడ్స్,హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్, ఉంటాయి. హెచ్‌డీఎల్, ట్రై గ్లిసరాయిడ్స్ ఎక్కువగా ఉంటే గుండె పోటు ముప్పు ఉందని అర్ధం. సీరమ్ క్రియాటినిన్. ఇది కిడ్నీ సంబంధిత పరీక్షే అయినే  గుండె వ్యాధికి లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే కిడ్నీలు సరిగ్గా లేకపోతే గుండెపై ఒత్తిడి పడుతుంది. ఈ పరీక్ష ద్వారా కూడా గుండె పరిస్థితి తెలుసుకోవచ్చు.

హిమోగ్లోబిన్ ఏ1సి పరీక్ష సాధారణంగా డయాబెటిస్ ఎప్పట్నించి ఎంత ఉందో తెలుసుకునేందుకు చేస్తారు. కానీ ఇది కూడా గుండె వ్యాధి పొంచి ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. సాధారణంగా గుండె వ్యాధి ముప్పు ఎక్కువగా డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం ఉన్నవారిలో ఉంటుంది. 

హెల్తీ లైఫ్‌స్టైల్ అలవర్చుకుంటే గుండె వ్యాధులతో పాటు ఇతర అనుబంధ వ్యాధులైన డయాబెటిస్, కిడ్నీ, స్థూలకాయం, రక్త పోటు సమస్యల్నించి గట్టెక్కవచ్చు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేయాలి. ధూమపానం, మధ్యుపానం వంటి అలవాట్లు మానుకోవాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా శరీరంలో జరిగే మార్పుల్ని పసిగట్టవచ్చు.

Also read: White Hair Problem: జుట్టు ఎందుకు తెల్లబడుతుంది, మీ డైట్‌లో ఈ విటమిన్ ఉంటే వైట్ హెయిర్ సమస్యకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News