Less Sleep Disease: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది బిజీ లైఫ్ కి అలవాటు పడిపోయారు. దీని కారణంగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమే కాకుండా.. రాత్రిపూట ఎక్కువగా మెలుకువతో ఉంటున్నారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరమని వైద్యులు తరచుగా చెబుతూ ఉంటారు. శరీరం ఫిట్ గా ఉండడానికి.. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా జీవనశైలితోపాటు ఆహారం, నిద్రపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇటీవలే పరిశోధనలో నమ్మలేని నిజాలు బయటికి వచ్చాయి. శరీరానికి తగిన పరిమాణంలో నిద్ర ఉంటే శరీరం యాక్టివ్ గా ఉండటమే కాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని పరిశోధనలో పేర్కొన్నారు.
తక్కువ నిద్ర కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది రాత్రులు పడుకోవడం మానేస్తున్నారు. అంతేకాకుండా ట్రెండింగ్ పేరిట రాత్రి వేళల్లో అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. దీని కారణంగా తీవ్ర గుండెపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలు వెళ్లడైంది. ఇలా రాత్రిపూట మేలుకోగా ఉండే వారిలో రక్తపోటు సమస్యలతో పాటు రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని న్యూరాలజీ జర్నల్ లో పేర్కొన్నారు. పరిశోధనల ప్రకారం ప్రతి 100 మందిలో 50 మంది నిద్ర లేకపోవడం కారణంగా స్ట్రోక్ బారిన పడుతున్నారని ఆ జర్నల్‌లో తెలిపారు.
Also Read: Guava Leaves Benefits: శరీర బరువును తగ్గించే జామ ఆకులు ఇవే, మధుమేహానికి కూడా చెక్ పెట్టొచ్చు..
ముఖ్యంగా చాలామంది మధుమేహానికి గురి కావడానికి ప్రధాన కారణం ఇదేనని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.నిద్రలేమి సమస్యల కారణంగా ఇప్పటికి చాలామందిలో గుండెపోటు సమస్యలు వచ్చాయని చికాగోలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన సెంటర్ ఫర్ సిర్కాడియన్ అండ్ స్లీప్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ ఫిలిస్ జి. పరిశోధనలో పేర్కొన్నారు. నెలరోజులపాటు నిద్ర లేకపోతే రక్తపోటుతో పాటు గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. అంతేకాకుండా చాలామందిలో జీర్ణక్రియ దెబ్బతింటుందని తెలిపారు. ఇప్పటికే అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు నిద్ర లేకపోతే మరిన్ని దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలో వెళ్లడైంది.
నిద్రలేని వారిని, నిద్ర ఉన్న వారితో పోల్చుకుంటే.. వారు ఎంతో యాక్టివ్ గా ప్రశాంతతతో జీవితాన్ని గడుపుతున్నారని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. కాబట్టి శరీరానికి నిద్ర లేకపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు 6 నుంచి 8 గంటల పాటు తప్పకుండా నిద్రపోవాలని పరిశోధకులు చెబుతున్నారు. నైట్ డ్యూటీలు చేసేవారు కాస్త సమయం దొరికినప్పుడు నిద్రపోవడం మంచిదని వారంటున్నారు.
Also Read: High Cholesterol: చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఇవేనా? మీరు కూడా బరువు పెరుగుతున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook