Dates Benefits: ఖర్జూరాలు మితంగా తింటే అమృతం.. మితిమీరి తింటే విషం!

Dates Benefits and Cons:  ఖర్జూరాలు రోజు మితంగా తినడం వల్ల శరీరానికి కావలసిన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే అంతకన్నా ఎక్కువ తింటే మన శరీరానికి.. ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఖర్జూరాల వల్ల మన ఒంట్లో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరగొచ్చు. మరి రోజుకి ఎన్ని ఖర్జూరాలు తింటే మంచిదో ఒకసారి చూద్దాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 25, 2024, 08:08 PM IST
Dates Benefits: ఖర్జూరాలు మితంగా తింటే అమృతం.. మితిమీరి తింటే విషం!

Soaked Dates Benefits: ఖర్జూరాలు.. మన ఆరోగ్యానికి కలిగించే ప్రయోజనాలు బోలెడు.. నిత్యం ఖర్జూరాన్ని ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగు పడటమే కాదు రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. 

ఖర్జూరంలో లభించే పోషకాలు..

ముఖ్యంగా మనకి ఖర్జూరంలో క్యాల్షియం,  ఐరన్,  ప్రోటీన్,  ఫైబర్,  మెగ్నీషియం,  పొటాషియం,  విటమిన్ b6 ,D వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి..

ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఖర్జూరం తినడం వల్ల ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ శరీరానికి పుష్కలంగా లభించి.. రక్త ఉత్పత్తిని ఉత్తేజ పరుస్తుంది. ముఖ్యంగా ఖర్జూరంలో ఉండే ఫైబర్, పొటాషియం,  యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని తరచూ అనారోగ్య బారిన పడకుండా కాపాడుతాయి.. ప్రతిరోజు ఖర్జూరం తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో ఖర్జూరం ప్రథమ స్థానం వహిస్తుంది. రక్తలేమి సమస్యతో బాధపడే వారికి ఖర్జూరం ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ప్రతిరోజు రెండు ఖర్జూరాలు తినడం వల్ల రక్తలేమి సమస్య నుంచి బయటపడతారు. 

ఇక ఇందులో ఉండే విటమిన్ డి ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది.. ఖర్జూరంలో మనకు కాపర్ ,ఫాస్పరస్ , పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా లభిస్తాయి ...ఎముకల వ్యాధుల నుండి కాపాడతాయి.. అలాగే దంతాలను బలోపేతం చేసి దంతాలు పటిష్టంగా మారడానికి ఉపయోగపడతాయి. ఇందులో లభించే కాల్షియం కూడా ఆరోగ్యానికి మంచి ప్రయోజన కారి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఖర్జూరాలను తినవచ్చు... వీటివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాదు అంతకుమించి వ్యాధి నిరోధక శక్తి మనలో పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. 

అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఖర్జూరం సహజసిద్ధమైన చక్కెర,  క్యాలరీలకు నెలవు..కాబట్టి రోజుకి 5 కంటే ఎక్కువ ఖర్జూరాలను తీసుకోకూడదని.. ఎక్కువ తీసుకుంటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం.. కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీరు ఖర్జూరాలు తినాలి అనుకుంటే రోజుకు ఐదుకు మంచి మోతాదులో తినకూడదు. 

ముఖ్యంగా గర్భవతులు ఖర్జూరం తప్పనిసరిగా తీసుకోవాలి . కడుపులో బిడ్డ పెరుగుతున్న సమయంలో.. తల్లిలో  రక్తహీనత సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది ..తద్వారా తల్లికి బిడ్డకి హాని కలుగుతుంది.. అందుకే ఖర్జూరం కనీసం రోజుకు మూడు తిన్నా సరే రక్తహీనత సమస్య నుండి అటు తల్లి ఇటు బిడ్డా బయటపడతారు .. ఆరోగ్యంగా ఉంటారు.. బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి ఖర్జూరం చాలా సహాయపడుతుంది.

Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News