Nose Hair Waxing effects : ముక్కులో వెంట్రుకలు తీసేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే

Nose Hair Waxing effects : ముక్కులో అవాంఛిత రోమాలను తొలగించుకోవడం సహజమే. ముక్కులో వెంట్రుకలు ఉండటం వల్ల కొద్దిగా అందవిహీనంగా కనిపించడం వాస్తవమే అయినప్పటికీ అవి ఆరోగ్యపరంగా మనకు ఎంతో మేలు చేస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2021, 11:51 PM IST
  • ఆరోగ్యాన్ని కాపాడు ముక్కులోని వెంట్రుకలు
  • ‌‌వైరస్‌లు, బ్యాక్టీరియా నుంచి రక్షణ
  • ముక్కు వ్యాక్సింగ్‌తో చాలా ప్రమాదాలు
Nose Hair Waxing effects : ముక్కులో వెంట్రుకలు తీసేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే

Nose Hair Waxing effects : మనలో చాలా మంది  ముక్కులో (Nose) ఒక్క వెంట్రుక (Hair) ఉండకుండా శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు. ముక్కులో అవాంఛిత రోమాలను తొలగించుకోవడం (unwanted hair removal) సహజమే. ముక్కులో వెంట్రుకలు ఉండటం వల్ల కొద్దిగా అందవిహీనంగా కనిపించడం వాస్తవమే అయినప్పటికీ అవి ఆరోగ్యపరంగా మనకు ఎంతో మేలు చేస్తాయి. అసలు ముక్కు రంధ్రాల్లోని వెంట్రుకలను తీసివేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి.. ముక్కులోని వెంట్రుకలు ఆ సమస్యలు రాకుండా ఎలా అడ్డుకుంటాయో ఒకసారి చూద్దాం. 

ముక్కులో వెంట్రుకలు (Nose Hair) ఉంటే వాతావరణంలో ఏర్పడే దుమ్ము, ధూళి కణాలను, సూక్ష్మజీవులను ముక్కు ద్వారా శ్వాసనాళంలోకి.. తద్వారా మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆపుతాయి. ఇంకా కొందరేమో ముక్కులో వెంట్రుకలను పీకేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు.  ఎందుకంటే వాటి కుదుళ్ళలో ఏర్పడే రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ (Infection) జరిగి రక్త నాళాల్లోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా రక్తం సరఫరా జరిగే సిరులలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. దీనినే కావర్నస్ సైనస్ థ్రోంబోసిస్ (Cavernous sinus thrombosis) అని అంటారు.  ఇది మెదడుపై అధిక ఒత్తిడిని తీసుకు రావడం వల్ల కొన్నిసార్లు మరణానికి కూడా దారి తీస్తుంది. సో.. ముక్కులో వెంట్రుకలు పీకేయడం వల్ల ఇంత పెద్ద సమస్య వస్తుంది.

Also Read : బాపట్లలోని బ్యాంకులో రూ.2 కోట్ల బంగారం మాయం

 వ్యాక్సింగ్‌తో చాలా సమస్యలు

ప్రస్తుతం చాలా మంది ముక్కు వ్యాక్సింగ్‌ (nose waxing) చేయించుకుంటూ ఉంటారు. ఇలా చేయించుకోవడం వల్ల అందంగా కనపడతామేమో కానీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముక్కు వెంట్రుకలు మనం పీల్చే గాలిని ఫిల్టర్ చేస్తాయి. ఈ వెంట్రుకలు గాలిలో ఉండే వైరస్‌లు, బ్యాక్టీరియా, ఇతర వ్యాధులకు కారణమయ్యే వ్యాధికారక క్రిముల నుండి రక్షణ కల్పిస్తాయి. శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ముక్కు వెంట్రుకలు అవసరం. 

బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి

ముక్కులో కొన్నిసార్లు మొటిమలు (pimples) కూడా వస్తాయి. ఇవి కాలుష్యం, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. ముక్కు (Nose)వెంట్రుకలు తేమతో ఒక ఉచ్చును ఏర్పర్చి ఎలాంటి వైరస్ లేదా బ్యాక్టీరియాను ఊపిరితిత్తులలోకి రాకుండా చేస్తాయి. అయితే ముక్కులోని వెంట్రుకలను కత్తిరించినప్పుడు లేదా వ్యాక్స్ చేసినప్పుడు వైరస్‌, బ్యాక్టీరియా ప్రవేశానికి  క్లీన్ ట్రాక్ ఏర్పడుతుంది. దీంతో అవి ఊపిరితిత్తులకు (Lungs) సులభంగా చేరుతాయి. అందువల్ల ఇక నుంచి ముక్కులోని వెంట్రుకలను మరీ ఎక్కువగా క్లీన్ చేసి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోకండి.

Also Read :  సింగర్‌గా మారిన ఎంపీ శశి థరూర్‌.. ఏం పాట పాడారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News