High Cholesterol Risk: వైద్య నిపుణులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను సైలెంట్ కిల్లర్ గా భావిస్తారు. ఎందుకంటే శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ఆధునిక జీవనశైలి పాటించే వారిలో త్వరగా శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది దీనికి తోడు మధుమేహం ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 100లో 55 శాతంకు పైగా తీవ్ర కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారని ఇటీవలే పరిశోధనల్లో వెల్లడయ్యాయి. ఇలాంటి సమస్యలు ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకునే వారిలో వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం చాలామందిలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా గుండెలోని ధమనులు, సీరల్లో చాలా రకాల మార్పులు వస్తాయి అంతేకాకుండా దీని కారణంగా రక్త వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. చివరికి గుండెపోటు బారిన పడి ప్రాణాంతకంగా మారే ఛాన్సులు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆధునిక జీవన శైలిని అనుసరిస్తున్న వారు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేయించిన ఆహారాలతో పాటు ప్రాసెస్ చేసిన ఫుడ్స్, పిజ్జా, బర్గర్, రెడ్ మీట్ లకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
అంతేకాకుండా చాలామంది ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనులు చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి వారిలో కూడా కొలెస్ట్రాల్ పరిమాణాలు విచ్చలవిడిగా పెరిగిపోయి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా వ్యాయామాలతో పాటు వాకింగ్ చేయడం కూడా చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా గంటల తరబడి కూర్చుని పనులు చేసేవారు గంటలు కనీసం మూడు నిమిషాల పాటు అయినా నడవడం మంచిదని వారు చెబుతున్నారు.
ముఖ్యంగా ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగడం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మధుమేహంతో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎంత సులభంగా శరీర బరువును నియంత్రించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి