చలికాలంలో సహజంగానే రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. ఫలితంగా వివిధ రకాల సమస్యలు, వ్యాధులు ఎదురౌతుంటాయి. ముఖ్యంగా గొంతు సంబంధిత సమస్యలు, జలుబు, జ్వరం, దగ్గు, కఫం ప్రధానంగా ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని హోమ్ రెమిడీస్ చిట్కాలతో సులభంగా ఈ సమస్యను అధిగమించవచ్చు.
ఆయుర్వేదంలో ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారముంది. గొంతు సంబంధిత సమస్యలకు, శీతాకాలం ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు మంచి పరిష్కారముంది. ముఖ్యంగా చలికాలంలో కఫం అనేది ప్రధాన సమస్యగా కన్పిస్తుంది. చాలా సందర్భాల్లో ఎంత కష్టపడినా ఈ కఫం సమస్య పోదు. కఫం సమస్య ఎక్కువైతే ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమౌతుంటుంది.
కఫం సమస్యకు మంచి పరిష్కారం అల్లం టీ. అల్లం రసం తాగడం వల్ల కూడా కఫం బయటకు వచ్చేస్తుంది. రెండవది వెల్లులి. వెల్లుల్లితో గొంతులో కఫం సమస్య తొలగిపోతుంది. పచ్చి వెల్లుల్లి రెమ్మలు 1-2 తిని నీళ్లు తాగేయాలి. ఇక మూడవది తేనె. తేనెతో గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలతో పాటు కఫం సమస్య ఇట్టే పోతుంది.
పైనాపిల్ పండు శరీరంలో పేరుకున్న కఫం ఇట్టే కరిగించేస్తుంది. రోజుకు కనీసం ఒక పైనాపిల్ అయినా తినాలి. జలుబు, దగ్గు సమస్యలు కూడా పరిష్కారమౌతాయి. ఇక ఆయుర్వేదంలో ఉన్న మరో చిట్కా వైద్యం జ్యేష్ఠ మధు. ఇదొక మూలిక. ఈ కర్రను ఉడకబెట్టి ఆ నీటిని తీసుకుంటే కఫం పోతుంది. ప్రతి వంటింట్లో తప్పకుండా లభించే యాలుక్కాయల్ని వేడి నీటిలో పోసి తాగడం వల్ల కఫం సమస్య పోతుంది.
ఇక పుదీనా ఆకుల్లోని పదార్ధాలు గొంతులో పేరుకున్న కఫంను తొలగిస్తాయి. దీనికోసం రోజుకు 4-5 పుదీనా ఆకుల్ని నీళ్లలో మరిగించి నిమ్మరసం కలుపుకుని తాగాలి.
Also read: Health Drinks: ఈ ఐదు డ్రింక్స్ డైట్లో ఉంటే..బీపీ, గుండె వ్యాధి రోగులకు ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook