Fish Oil: ఫిష్ ఆయిల్‌ని వినియోగించడం వల్ల కాలేయ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

Fish Oil Capsule: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది చిన్న వయసుల్లోనే కంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడడం విశేషం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 14, 2022, 02:09 PM IST
  • ఫిష్ ఆయిల్‌ని వినియోగించడం వల్ల..
  • కాలేయ సమస్యలకు చెక్ పెట్టొచ్చు
  • దెబ్బతిన్న కాలేయాన్ని తొలగిస్తుంది
Fish Oil: ఫిష్ ఆయిల్‌ని వినియోగించడం వల్ల కాలేయ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

How Is Fish Oil Beneficial For Liver: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది చిన్న వయసుల్లోనే కంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడడం విశేషం. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్‌ ఉన్నాయి. ముఖ్యంగా ఫిష్ లివర్ ఆయిల్ సప్లిమెంట్స్  వంటివి అనేక ఉత్పత్తుల మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఫిష్ లివర్ ఆయిల్ ఉండే వివిధ రకాల మూలకాలు కంటి చూపును మెరుగు పరచడమేకాకుండా మెదడుకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కాలేయ సమస్యలను కూడా నియంత్రిస్తుంది.  ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఆమ్లాలుంటాయి. ఇవి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి.

కాలేయ సమస్యలకు దారితీయడానికి ప్రధాన కారణాలు ఇవే:

   << టాక్సిన్ నిర్మాణం
   << శరీరంలోకొవ్వు చేరడం
   << మద్యం సేవించడం
   << అతిగా ఔషధ వినియోగం
   <<చెడు జీవనశైలి
   <<ఊబకాయం
   << జన్యు పరిస్థితులు
   << అనారోగ్యకరమైన ఆహారం

కాలేయా సమస్యలకు ఫిష్ ఆయిల్ వల్ల ప్రయోజనాలున్నాయా..?

1. కాలేయంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి:
ప్రస్తుతం చాలా మందిలో లివర్ వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చేప నూనెను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒమేగా 3 కాలేయ సమస్యలకు క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

2. దెబ్బతిన్న కాలేయాన్ని తొలగిస్తుంది:
ఫైబ్రోసిస్ అనేది దెబ్బతిన్న కాలేయ కణాలు. అయితే వీటిని మెరుగుపరిచి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కాలేయం చెడి పోకుండా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫైబ్రోసిస్‌ను తగ్గించడానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ కృషి చేస్తాయి.

3. కాలేయాన్ని రిపేర్ చేస్తుంది:
ఆక్సీకరణం వల్ల కాలేయ కణజాలానికి నష్టం జరుగుతుంది.  అయితే తరచుగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను వినియోగించడం వల్ల కాలేయా సమస్యలు దూరమవుతాయి.

4. ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తుంది:
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా వైద్య శాస్త్రం పేర్కొంది. అయితే చాలా మందిలో ఫ్రీ రాడికల్స్ వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఒమేగా 3ని వినియోగించవచ్చు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !

Also Read: Happy Independence Day: రేపే భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఇండిపెండెన్స్ డే కొటేషన్స్, విషెస్, స్టేటస్‌లు మీకోసం 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News